ఇటీవల గుజరాత్లో డ్రగ్స్ ఎక్కువగా బయటపడ్డాయి. కేవలం నెల రోజుల్లోనే సుమారు ఆరు చోట్ల చేసిన దాడుల్లో మూడు వేల కిలోలకు పైగా డ్రగ్స్ ను అధికారులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా మందికి ఓ ప్రశ్నగా మిగిలింది. అధికారులు చెప్పిన దాని ప్రకారం ఇది పాకిస్తాన్ నుంచి గుజరాత్లోని సముద్ర తీరాలకు కొంతమంది రవాణా చేస్తున్నారు. ఇలా పెద్ద మొత్తంలో తీసుకువచ్చిన దానిని చిన్న చిన్న ప్యాకెట్లు గా తయారుచేసి కోరిని దగ్గర దానిని డెలివరీ చేస్తారు అని అధికారులు పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి భారీ స్థాయిలో పట్టుబడడం చాలామందిని విస్మయానికి గురి చేస్తోంది.
ఇదిలా ఉంటే గుజరాత్ లో పట్టుబడిన మాదకద్రవ్యాలకి మూలం ఆఫ్ఘనిస్తాన్ లో ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొన్నారు. మొదటగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ సరుకు వచ్చే పాకిస్తాన్ కి చేరుతుందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అక్కడ నుంచి ప్రాసెస్ అయిన తర్వాత ఏ దేశానికి కావాలంటే.. ఆ దేశానికి దానికి సంబంధించిన వారు డెలివరీ చేస్తారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్లో ప్రాసెస్ అయిన డ్రగ్స్ ను ఇండియాకు సముద్ర మార్గం ద్వారా పంపించినట్లు అనుమానిస్తున్నారు.
ఇటీవల గుజరాత్ లో మెర్బీ అనే ప్రాంతంలో అధికారులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో 600 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన హెరాయిన్ మొత్తం 120 కిలోలుగా ఉందని అధికారులు చెప్పారు. దీనిని పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ఓ పడవలో తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఆ దేశానికి చెందిన డ్రగ్ పెడ్లర్ దీనిని వారికి పంపించినట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ డ్రగ్స్ కచ్చితంగా అంతర్జాతీయం మార్కెట్ కు కేంద్రబిందువుగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్లో నల్లమందు వ్యాపారం ఇటీవల జోరందుకుంది అని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొంది. గత రెండేళ్లుగా చూస్తే ఈ వ్యాపారం సుమారు 8 శాతం పెరిగిందని అధికారులు గుర్తించారు. ఆఫ్ఘనిస్తాన్ లో పండే నల్ల మందు ద్వారా ప్రపంచం మొత్తానికి సరిపడా హెరాయిన్ ను తయారు చేయవచ్చు. ఇదే నివేదిక ప్రకారం అన్ని దేశాల్లో విక్రయిస్తున్న మొత్తం హెరాయిన్ 85 శాతం ఆఫ్ఘనిస్తాన్ కు చెందినదని తెలిపింది.
అనధికారికంగా విక్రయించిన హెరాయిన్ తో గతేడాది ఆఫ్ఘనిస్తాన్ జిడిపి 9 శాతం పెరిగినట్లు ఐరాస పేర్కొంది. అయితే ఆఫ్ఘనిస్థాన్లో ఈ వ్యాపారం చేసే వారికి ప్రధాన కస్టమర్లుగా ఉత్తర అమెరికా, ఆసియాలు ఉన్నాయి. ఆసియాలోని వివిధ దేశాలకు ఇలా ఎన్నో దేశాలకు దీనిని సప్లై చేయాలి అంటే ఏమి ముందుగా ఇది పాకిస్తాన్ లో ప్రాసెస్ కావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కిలోల లెక్కన బయట దేశాలకు సరఫరా చేస్తారు. ఈ సరఫరా అనేది ఐరాస పేర్కొన్నా దాని ప్రకారం.. గుజరాత్లోని సముద్రతీరాలకు రవాణా చేసి ఈ దందాను జోరుగా నడుస్తున్నట్లు గుర్తించింది ఐరాస. పెద్ద మొత్తంలో లాభాలు దీనిలో వస్తుండడం డీలర్ లను ఎక్కువ ఆకర్షిస్తుందని అధికారులు చెప్తున్నారు. దీని కారణంగే ఈ వ్యాపారంలోకి దిగుతున్నట్లు చెప్పారు.