ఏపీలో బీజేపీ నేతలకు ఓటు బ్యాంక్ లేదు. గత ఎన్నికల్లో నోటా కటే తక్కువగా ఓట్లు పడ్డాయి. అయితే కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏపీలో చక్ర్తం తిప్పుతోంది కమలం పార్టీ. ఆ పార్టీకి అందరూ కావాలి. అందుకే కీలకమైన డెసిషన్ తీసుకోవడం లేదు అన్న విమర్సలు ఉన్నాయి.
బీజేపీ కనుక కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఏపీలో 2014 నాటి పొత్తులు కచ్చితంగా రిపీట్ అవుతాయి. అపుడు వైసీపీకి రాజకీయంగా సంకట పరిస్థితి ఉంటుంది. అయితే బీజేపీకి అవ్వా కావాలి బువ్వా కావాలి అన్నట్లుగా టీడీపీ సైడ్ వచ్చి వైసీపీని దూరం చేసుకుంటే వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో సీట్లు చాలకపోతే అన్న బెంగ బెదురు ఉన్నాయని అంటారు. మరో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీతో ఈ రోజుకు చెలిమి చేసిన ఎన్నికల తర్వాత కేంద్రంలో తమకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందా లేదా అన్న డౌట్ కొడుతోంది.
దాంతో పాటు బీజేపీకి మరిన్ని అత్యాశలు ఉన్నాయి. అవేంటి అంటే వైసీపీ టీడీపీలను పక్కన పెట్టి ఏదో నాటికి తాను ఏపీలో అధికారంలోకి రావాలని, దాంతో ముందుగా అందుబాటులో ఉన్న తెలుగుదేశాన్ని రాజకీయంగా ఎలిమినేట్ చేస్తే తమ పబ్బం గడుస్తుంది అని ఆలోచిస్తోంది.
అందుకే బీజేపీకి 2024 పెద్ద టార్గెట్ కాదు, ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకుంటే ఆ మీదట వైసీపీ అధికారంలోకి వచ్చినా ఫరవాలేదు. తెలుగుదేశం దెబ్బ తింటేనే తమ ఎదుగుదల అన్న హిడెన్ అజెండా ఉంది. అందుకే జనసేనతోనే పొత్తు అని బీజేపీ నేతలు చెబుతూంటారు. అయితే పవన్ కళ్యాణ్ విషయమే తీసుకుంటే ఆయన ఏపీలో వైసీపీని ఓడించాలి అంటే అన్ని పార్టీలు కలవాలని కూడా నినదిస్తూంటారు.
కానీ ఏపీలో చూస్తే బీజేపీ వైఖరి వారి రాజకీయ అజెండా వారి టార్గెట్లతోనే పవన్ కి ఇబ్బంది అని అంటున్నారు. ఏపీలో 2024లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తే ఆ తాము కూడా అధికారంలో ఉండాలని ఆ విధంగా బలం పెంచుకుని 2029 నాటికి గట్టి ఫౌండేషన్ వేసుకోవాలని పవన్ అజెండా ఒకటి ఉంది.
అలా కాకపోయినా తన బలాన్ని పెంచుకుని అధికార వాటాను 2024 ఎన్నికల ముందే కుదుర్చుకుని ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ విషయంలో కనుక దగ్గరగా వెళ్తే రేపటి రోజున తన రోడ్ మ్యాప్ కి ఇబ్బంది అవుతుంది అని పవన్ కావాలనే బీజేపీని పక్కన పెడుతున్నారు అని అంటున్నారు. అందుకే వాజ్ పేయ్ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 25న బీజేపీ జనసేన ఉమ్మడి మీటింగ్ కి రమ్మని పిలిచినా జనసేన పెద్దగా రెస్పాండ్ కాలేదని అంటున్నారు.
బీజేపీతో ఒకసారి కనుక కమిట్ అయితే అది ఇబ్బందిగా ఉంటుందని, రేపటి రోజున తెలుగుదేశం తో పొత్తులు అన్న ఆప్షన్ కూడా లేకుండా చేసుకోవాల్సి వస్తుందన్న ఆలోచనలతో జనసేన ఉంది అంటున్నారు. అయితే ఇప్పటికీ జనసేన ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉంది అంటున్నారు. ఎన్నికల వేళకు అయినా బీజేపీ తన మనసు మార్చుకుంటే 2014 పొత్తులు రిపీట్ అవుతాయని అంటున్నారు. మొత్తానికి ఇప్పటీకితే దూరం గానే ఉంటే బెటర్ అన్నదే జనసేన వ్యూహంగా కనిపిస్తోందిట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.