మే మూడు వరకూ లాక్ డౌన్ రెండో దశను ప్రకటించిన ప్రధాని మోడీ.. రెండో రోజునే కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నెల 20 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాల్లోనూ.. కంటైన్ మెంట్ మినహా మిగిలిన చోట్ల లాక్ డౌన్ పరిధిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని విడుదల చేశారు. బయటకు వెళ్లే వేళలో తప్పనిసరిగా మాస్కులు ధరించటం.. వీధుల్లో ఉమ్మి వేయటంపై ఆంక్షలు విధించటమే కాదు.. నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. గ్రామీణ భారతానికి ఊరట ఇచ్చేలా కేంద్రం విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు కొంతమేర రిలీఫ్ ఖాయమని చెప్పాలి.అన్ని కాకున్నా కొన్ని అంశాలకు మినహాయింపులు ఇవ్వటం ద్వారా జనజీవనం కొంతమేర షురూ అవుతుందని చెప్పక తప్పదు. కరోనా భయాందోళనతో ముందస్తు జాగ్రత్తగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్న వైనం తెలిసిందే. వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి పరిమితంగా కొన్ని సంస్థలు.. వ్యాపారాలు.. ఇతర సేవలు అందించే వారి విషయంలో ఆంక్షల్ని సడలిస్తూ కేంద్రం నిర్ణయాన్ని తీసుకుంది. అయితే.. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కంటైన్ మెంట్ విధించిన ప్రాంతాలకు మాత్రం కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఏ మాత్రం అమలు కావు.
ఇంతకీ కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఏముందన్న విషయాన్ని చూస్తే..
% పని ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ సదుపాయాలను కల్పించాలి.
% ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్ వర్కర్లు, ప్లంబర్లు, మోటారు మెకానిక్‌లు, కార్పెంటర్లకు లాక్ డౌన్ మినహాయింపు
% ఎస్ఈజెడ్‌ల్లోని పరిశ్రమలు, ఎగుమతులు చేసే పారిశ్రామిక కేంద్రాల్లో కార్యకలాపాలు స్టార్ట్ చేయొచ్చు
% హైవేలపై ఉన్న దాబాలు(హోటళ్లు), ట్రక్ రిపేరింగ్ దుకాణాలు.. కాల్ సెంటర్లు ప్రారంభం చేసుకోవచ్చు
% వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన సామగ్రిని అమ్మే షాపులు.. వాటిని రిపేర్లు చేసే దుకాణాలు తెరవొచ్చు.
% ఔషధ, వైద్య పరికరాల తయారీ యూనిట్లు, ఆరోగ్య మౌలిక వసతుల్ని స్టార్ట్ చేయొచ్చు.
% రక్షణ, పారా మిలటరీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, విపత్తు నిర్వహణ, ఎన్ఐసీ, ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, నెహ్రూ యువ కేంద్ర, కస్టమ్స్ కార్యాలయాలు పని చేయొచ్చు.
% మిగిలిన శాఖల్లోని డిప్యూటీ సెక్రటరీ ఆపై హోదా ఉన్న అధికారులు కచ్చితంగా 100% హాజరు పాటించాలి. మిగతా ఉద్యోగులు అవసరాన్ని బట్టి 33% వరకు హాజరు కావాలి.
% ప్రజల అవసరాలకు తగ్గట్లు అవసరమైన కార్యకలాపాలకు అనుగుణంగా పనులు చేసుకోవచ్చు.
% లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూనే నియమిత సంఖ్యలో పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతి.
% ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో కార్యకలాపాలతోపాటు ఈ కామర్స్.. డేటా.. ఆన్ లైన్ బోధన షురూ చేయొచ్చు
% బ్యాంకులు, బీమా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు పని చేస్తాయి.
% అన్ని సంస్థలు వీలైనంత వరకు ఉద్యోగుల్ని తమ ఇళ్ల నుంచే పని చేసే అవకాశం ఇవ్వాలి.
% ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేసే ఈ కామర్స్ సంస్థలకు అనుమతి.
% నిత్యావసర, నిత్యావసరం కానివి అనే తేడా లేకుండా అన్ని వస్తువుల రవాణాకు ఓకే.
% రోడ్లు, భవనాలు, ఇరిగేషన్.. ఇతర పారిశ్రామిక ప్రాజెక్టులు పనులు చేపట్టొచ్చు
% గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులకు అనుమతి.
% అంత్యక్రియలకు 20 మంది లోపు పాల్గొనొచ్చు.
వేటికి వర్తించవు?
- అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా ప్రయాణాలకు నో. మే 3 వరకు బస్సు, మెట్రో సర్వీసులు నడవవు.
- విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, రైలు సర్వీసులు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, జిమ్స్, క్రీడాకేంద్రాలు, ఈత కొలనులు, బార్ అండ్ రెస్టారెంట్స్ పని చేయవు.
- మత ప్రాంతాలు, ప్రార్థనాకేంద్రాలను మూసే ఉంచాలి. రాజకీయ,క్రీడ, సామాజిక కార్యక్రమాలపై నిషేధం.