ఎవరికి వారే యమునా తీరే.. తాము గెలిస్తే చాలు.. పక్కోడు ఏమైపోతేనేమీ.. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.. తెలంగాణ కాంగ్రెస్ ను నడిపించే నాయకుడే లేడా? పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికే పరిమితమవ్వడం ఏంటీ? మిగతా తెలంగాణ నియోజకవర్గాల్లో ఎవరు లీడ్ చేయాలి.? అసలు జానా, భట్టి, ఇతర సీనియర్లు ఎటు పోయారు.? తెలంగాణ కాంగ్రెస్ కు ఎంటీ పరిస్థితి.?
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఇప్పుడు ఒంటరిగా ప్రచారం చేసుకుంటున్నారు.. అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ రావడం.. కొన్ని ఎంపీ స్థానాల్లో ప్రచారం చేయడం వెళ్లిపోవడం జరుగుతోంది. మరి మిగతా ఎంపీ సీట్లలో ఎవరూ చేయాలి.. తెలంగాణ కాంగ్రెస్ ను నడిపించే నాయకుడు ఎవరు? ఎవరూ అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ భరోసానివ్వాలి అంటే తెలంగాణ కాంగ్రెస్ లో మచ్చుకైనా ఒక్క నేత కూడా కనిపించకపోవడం గమనార్హం..
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థులకు తోడుగా స్టార్ క్యాంపెయినింగ్ చేయడానికి సీనియర్లు కరువయ్యారు. విజయశాంతి తిరిగినా అంత బజ్ రావడం లేదు. ఇక పీసీపీ చీఫ్ ఉత్తమ్ తను పోటీచేస్తున్న నల్గొండలోనే ప్రచారం చేస్తున్నాడు. కొడంగల్ లో ఓడిన రేవంత్ మల్కాజిగిరిలో గెలవాలని పెద్ద పెద్ద ప్లాన్ లు చేస్తూ అక్కడే ప్రచారం చేసుకుంటున్నారు. కోమటిరెడ్డి భువనగిరికే పరిమితమయ్యాడు. ఇలా సీనియర్లంతా తమ దారి తాము చూసుకోవడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులకు తోడుగా ప్రచారం చేసేవారే కరువయ్యారట.. ఇలా అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది.. టీఆర్ఎస్ ను ధీటుగా ఎలా ఎదుర్కొంటోంది.. అసలు చుక్కాని లేని నావలా ఉన్న కాంగ్రెస్ ఎలా ఒడ్డుకు చేరుతుందని ఎంపీ అభ్యర్థులు వాపోతున్నారట..