జలుబు చేసింది. దగ్గు కూడా ఉంది. జ్వరం కూడా వస్తోంది. ఏమై ఉంటుంది? అన్నంతనే.. కొంపదీసి కొవిడ్ కాదుకదా? అన్న సందేహం వ్యక్తమయ్యే పరిస్థితి. ఇటీవల కాలంలో ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలా అని కొవిడ్ టెస్టు చేయిస్తే.. అందులో నెగిటివ్ వస్తుంది. కానీ.. వచ్చి పడిన జర్వం తగ్గదు.. దగ్గు వదలదు.. జలుబు పోదు. మరి.. వీటిని అధిగమించటం ఎలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకీ ఇది కొవిడా? ఇంకేదైనా? అన్నది ప్రశ్నగా. దానికి సమాధానం వెతికితే ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. దీన్ని అధిగమించటానికి ఉన్న మార్గాలు ఏమిటన్నది కూడా ప్రశ్నగా మారింది.
ఇటీవల కాలంలో జలుబు.. దగ్గు.. జ్వరంతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అది కూడా ఒకసారి ఇవి వస్తే.. వారాల తరబడి వెంటాడుతున్న పరిస్థితి. ఇది కరోనా అని భయపడేవారికి అది కాదని కొవిడ్ టెస్టు స్పష్టం చేస్తుంది. మరి.. ఇదేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు నిపుణులు ఏం చెబుతున్నారంటే ఇది ''హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయోంజా' అనే వైరస్. దీని బారిన పడినోళ్లు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. కానీ.. ఇంట్లో ఉండి కూడా ఇబ్బందులకు గురి అవుతుంటారు. ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తక్కువే. కానీ.. తీవ్రత ఎక్కువ ఉన్న వారు ఆసుపత్రిలో చేరినా.. వారికి ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి చాలా చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
కొవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ .. ఈ మాయదారి వైరస్ లెక్క వేరుగా ఉంటుందని చెప్పాలి. కరోనా వస్తే.. అది పక్కనోళ్లకు వెంటనే వ్యాపిస్తుంది. పద్నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ.. ఈ మాయదారి ఇన్ ఫ్లూయోంజా మాత్రం వారాల తరబడి ఇబ్బంది పెడుతుంటుంది. కాకుంటే.. ఇతరులకు సోకే విషయంలో దీని ప్రభావం చాలా తక్కువ. ఈ మొత్తం ఎపిసోడ్ లో దీన్ని ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు.
ఈ ఇన్ ఫ్లూయోంజా సోకిన వారిలోనూ కొవిడ్ సోకిన వారి మాదిరే.. జ్వరం.. జలుబు.. తలనొప్పి.. ఒళ్లు నొప్పులు.. సైనస్.. గొంతునొప్పి.. వాంతులు.. విరేచనాలు.. రుచి, వాసన కోల్పోవటం లాంటివి వచ్చే పరిస్థితి. అయితే.. మిగిలిన సమస్యలు పోయినా.. దగ్గు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. ఐసీఎంఆర్ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం హెచ్3ఎన్2 సోకిన వారిలో ఎవరికీ ఆక్సిజన్ పెట్టాల్సిన అసవరం లేదంటున్నారు.
కాకుంటే.. ఈ ఇన్ ఫ్లూయోంజా బారిన పడినోళ్లకు యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదని చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపించినంతనే కరోనా టెస్టు చేయించుకోవటం.. అందులో రిజిల్ట్ నెగిటివ్ అయితే.. దాదాపుగా కొత్త ఇన్ ఫ్లూయోంజా అయి ఉంటుందని చెబుతున్నారు.
ఈ లక్షణాలతో ఇబ్బంది పడే వారు.. కరోనా మందులు మాత్రం వాడకూడదని స్పష్టం చేస్తున్నారు. సో.. సొంత వైద్యం ఆపి.. ఆరోగ్య సమస్యల ఎదురైనంతనే వైద్యులకు చూపించి వారి సూచనల్ని పాటిస్తూ ట్రీట్ మెంట్ చేయించుకోవటం మంచిదని మాత్రం చెప్పొచ్చు. బీకేర్ ఫుల్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.