ఈ ఎంఎల్ఏలకు ఏమైంది?

Update: 2022-09-29 04:41 GMT
అధికార పార్టీలోని కొందరు మంత్రులు, ఎంఎల్ఏల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. వీరిలో అత్యధికులు రెగ్యులర్ గా జనాలతో టచ్ లోనే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమంలో పాల్గొనటంలో బాగా వెనకబడిపోయారు. గడచిన ఆరు మాసాలుగా జరుగుతున్న కార్యక్రమంలో 20 మంది ఎంఎల్ఏలు పట్టుమని 10 రోజులు కూడా పార్టిసిపేట్ చేయలేదు.

ఈ విషయాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డే సమీక్షలో కార్యక్రమంలో తిరగని మంత్రులు, ఎంఎల్ఏల జాబితాను చదివి వినిపించారు. ఇక్కడే వీళ్ళ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, రోజా, దాడిశెట్టి రాజా, విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు నియోజకవర్గంలో తిరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కార్యకర్తలతో కూడా టచ్ లోనే ఉంటారు. ఎలాగూ నియోజకవర్గాల్లో తిరుగుతునే ఉన్నపుడు గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో ఎందుకు తిరగటం లేదో అర్థం కావటం లేదు.

ఇక ఎంఎల్ఏల్లో కూడా చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదీప్ రాజ్, కోరుముట్ల శ్రీనివాసులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, గ్రంధి శ్రీనివాస్ లాంటి వాళ్ళు తరచూ తమ నియోజకవర్గాల్లో తిరుగుతునే ఉంటారు.

ఎలాగు తిరుగుతున్నారు కాబట్టి గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో తిరిగితే సరిపోయేది. కానీ ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో జనాలందరినీ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ప్రతి గడపను టచ్ చేయాలని జగన్ చెబితే మాత్రం ఆ పని చేయటంలేదు.

అసలు జనాలకు, కార్యకర్తలకు టచ్ లోనే ఉండని ఎంఎల్ఏలను ఎవరు ఏమీ చేయలేరు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ఎంఎల్ఏలకు టికెట్లు దక్కేది కూడా అనుమానమే.

బెంగుళూరులో వ్యాపారాలు చేసుకుంటే ఎప్పుడైనా నియోజకవర్గాల్లో కనబడుతున్నారనే ఆరోపణలున్న ఎంఎల్ఏలు కూడా ఉన్నారు. ఇలాంటి వారు కూడా జగన్ చెప్పిన కార్యక్రమంలో రెగ్యులర్ గా తిరుగుతున్నారు. మొత్తానికి డైరెక్టుగా జగన్ లిస్టు చదివిన తర్వాత అందరు ఈ ఎంఎల్ఏలకు ఏమైందని చర్చించుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News