బ్యాట్స్ మెన్ ని ఔట్ చేయాలన్న దురుద్దేశంతో బౌలర్ నిబంధనలకు విరుద్ధం బౌలింగ్ చేసి క్రికెట్ చేయాలని ప్రయత్నించడమే..ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్. క్రికెట్ ఆడడం మొదలైన కొత్త లోనే బౌలర్లు ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్ మెన్ ను అవుట్ చేయడానికి వివిధ రకాలుగా బౌలింగ్ తీరును మార్చుకుని బంతిని విసిరేవారు. దీంతో అలాంటి ఆటకు చెక్ పెట్టేందుకు 1890ల్లోనే కొన్ని నిబంధనలు తీసుకువచ్చారు. ఆ నిబంధనల మేరకు బౌలింగ్ చేయకపోతే బౌలర్ పై తగిన చర్యలు తీసుకునే వారు. ఇలా ఇల్లీగల్ బౌలింగ్ చేసి పట్టుబడ్డ బౌలర్ల సంఖ్య భారీగానే ఉంది. 1895లోనే ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్ అంటూ చర్యలు తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఇద్దరే ఇద్దరు. వారిలో నెంబర్ వన్ శ్రీలంక బౌలర్ మురళీధరన్, నంబర్ 2 అయిన ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వార్న్. వారిద్దరిది కూడా ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్ అని ఆరోపణలు వచ్చాయి. జింబాబ్వే, ఇంగ్లాండ్, వెస్టిండీస్ భారత బౌలర్ల పై కూడా ఆరోపణలు వచ్చాయి. ముత్తయ్య మురళీధరన్ ఐతే పలుమార్లు తన బౌలింగ్ యాక్షన్ పై ఫిర్యాదులు ఎదుర్కొన్నాడు. ఎవరైనా ఇల్లీగల్ బౌలింగ్ చేస్తే వారిపై ప్రస్తుతం ఐసీసీ చర్యలు తీసుకుంటోంది.
అసలు ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్ అంటే ఏంటి
ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలర్ బంతి విసిరేటప్పుడు మోచేతిని 15 డిగ్రీలకు మించి వంచకూడదు. ఒకవేళ బౌలర్ అలా తన మోచేతిని 15 డిగ్రీలకు మించి వంచి బౌలింగ్ చేస్తే ఆ బంతిని అక్రమ బౌలింగ్ యాక్షన్ గా పరిగణిస్తారు. అంపైర్ కు ఆ బంతికి వికెట్ పడితే నాటౌట్ ప్రకటించే అధికారం ఉంది. గత ఏడాది భారత్ తో టెస్ట్ లు ఆడిన వెస్టిండీస్ ఆ జట్టు బౌలర్ బ్రాత్ వైట్ బౌలింగ్ యాక్షన్ తీరుపై అంపైర్లు ఐసీసీ కి కంప్లైంట్ చేశారు.
కొన్నేళ్లుగా నరైన్ చుట్టూ
సునీల్ నరైన్ గత శనివారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో.. మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో అక్రమ బౌలింగ్ కు పాల్పడ్డాడని ఫీల్డు అంపైర్లు అతనికి వార్నింగ్ ఇచ్చారు. ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్ జాబితాలో అతడి పేరు చేర్చారు. మరోసారి నరైన్ ఇలా బౌలింగ్ చేస్తే ఐపీఎల్ నుంచి బౌలర్ గా అతడి ఆటను నిషేధం విధించే అవకాశం ఉంది. బ్యాట్స్మెన్గా మొత్తం కొనసాగవచ్చు. ఐపీఎల్ లో అక్రమ బౌలింగ్ తో నరైన్ ఫిర్యాదులు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. నరైన్ 2012 నుంచి కోల్ కతా జట్టు తరఫున ఆడుతున్నాడు. 2014లో ఐపీఎల్లో అతడి బౌలింగ్ తీరుపై ఫిర్యాదు చేయడంతో అతడు కొద్దిరోజులు ఆటకు దూరమయ్యాడు. 2015లో శ్రీలంకతో జరిగిన వన్డే లో కూడా ఇలాగే బౌలింగ్ చేయడంతో ఐసీసీ అతడిని ఆ ఏడాది జరిగిన వరల్డ్ కప్ ఆడకుండా నిషేధించింది. నరైన్ ఐపీఎల్లో మరోసారి ఇలాంటి ఫిర్యాదు ఎదుర్కొంటే మాత్రం అతడిని సీజన్ మొత్తం నిషేధించే అవకాశాలు ఉన్నాయి.