ఏపీలోకి కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరిస్తున్నారు. అంతా బాగానే ఉంది. బీఆర్ఎస్ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. ఏపీ నేతలు ఎదురొచ్చి మరీ చేరారు.. అంతా ఓకే కానీ.. ఏపీ విషయంలో కేసీఆర్ నిబద్ధత ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. రాష్ట్ర విభజన జరిగిపోయింది. విభజన తర్వాత సెక్షన్ 9, సెక్షన్ 10 సంస్థల ఆస్తులు ఈరోజు వరకూ కూడా ఏపీకి తెలంగాణ ఇవ్వడం లేదు. ఎందుకంటే అవి తెలంగాణలోనే ఉన్నాయి. రాజధాని హైదరాబాద్ కావడంతో ఇక్కడే ఉండిపోయాయి. అట్లాగే.. కృష్ణ, గోదావరి జలాల వివాదంలో ఈరోజు వరకూ తెలంగాణ గొడవ పెడుతూనే ఉంది. కిందకు నీళ్లు విడుదల చేస్తే లొల్లి పెడుతూనే ఉంది.
ఏపీకి చెందిన రావెల, తోట, రమేష్ నాయుడు, ఇతరులు అందరూ బీఆర్ఎస్ లో చేరిన వేళ కేసీఆర్ సుధీర్ఘ ప్రసంగం చేశారు. దేశాన్ని ఇలా చేద్దాం.. అలా చేద్దాం అంటూ గొప్పలకు పోయారు. అయితే ఆంధ్రాను ఏం చేస్తానన్న విషయాన్ని కేసీఆర్ చెప్పడం లేదు. తెలంగాణ అడ్డంకుల వల్లనే ఆంధ్రాకు సగం నష్టం జరుగుతోంది. నిధులు, నీళ్ల విషయంలో తెలంగాణ మొండిగా వెళ్లడం ఏపీకి నష్టం వాటిల్లేలా చేస్తోంది.
సుధీర్ఘంగా కలిసి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక లాభపడింది తెలంగాణనే. బంగారు బాతు లాంటి హైదరాబాద్ తెలంగాణకు వచ్చేసింది. భారీగా ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది. అదంతా తెలంగాణకే దక్కుతోంది. ఇవాల్టీకి ఆదిలాబాద్,నిజామాబాద్, మహబూబ్ నగర్ లాంటి వారు అలానే ఉన్నారు. కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి జరిగింది.
హైదరాబాద్ మినహాయిస్తే తెలంగాణలో ఏం సాధించారని కేసీఆర్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారన్నది ఇక్కడ ప్రశ్న. హైదరాబాద్ లో ఆంధ్రా వాళ్లు బాగా వచ్చి ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టడంతో సంపద పోగై అభివృద్ధి జరిగింది. తెలంగాణ వచ్చాక మరింత విస్తరించింది. కానీ హైదరాబాద్ లా మరో నగరం వరంగల్ అభివృద్ధి కాలేదు. మరే నగరం కూడా నోచుకోలేదు. తెలంగాణలో మరో మహానగరం ఏం సృష్టించారన్నది కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నేనొస్తే దేశం మారిపోతుంది.. బీజేపీ పడిపోతుంది.. మార్పు రావాలంటున్న కేసీఆర్.. అసలు ఏపీకి ఏం చేస్తారన్నది చెప్పకుండా మిన్నకుండడమే అసలు సమస్య. ఈ విషయంలో కేసీఆర్ నోరుతెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.