గెలుపులోనూ ఓటమి ఎదురయ్యేలా చేసుకోవటంలో కాంగ్రెస్ పార్టీకి మించింది మరేది ఉండదు. మోడీ విజయం బీజేపీ సమర్థత కంటే కూడా కాంగ్రెస్ అసమర్థతతోనే సాధ్యమవుతుందన్న విషయం మరోసారి నిరూపితమైంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు.. దేశానికి పెద్ద మలుపు లాంటి పడికట్టు పదాలతో మాటలు చెప్పే వారికి సైతం నోటమాట రాకుండా చేసేసిన ఆ పార్టీ.. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై పడుతున్న తర్జనభర్జనల్నిచూసిన తర్వాత అనిపించేది ఒక్కటే. ఇన్ని ఎదురుదెబ్బలు.. గుణపాఠాలతో నేర్చుకున్నదేంటి? ఆ పార్టీకి ఈ దరిద్రపుగొట్టుతనం నుంచి బయటకు రాదా? ఆశీర్వదించిన ప్రజలే..ఛీ కొట్టే వరకు తెచ్చుకోవటం కాంగ్రెస్ కు చేతనైనంత బాగా మరెవరికీ తెలీదన్నట్లుగా తాజా పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి.
నిజమే.. కర్ణాటక పీఠాన్నిసిద్దరామయ్యకు ఇవ్వాలా? డీకే శివకుమార్ కు కట్టబెట్టాలా? అన్నది అంత తేలిగ్గా తేల్చేసే విషయం కాదు. ఈ నిర్ణయం తీసుకోవటానికి ఎదురయ్యే ప్రాక్టికల్ ఇబ్బందులు చాలానే ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ.. దానికి సంబంధించిన ఇబ్బందులు కాంగ్రెస్ వార్ రూంకే పరిమతం కావాలే కానీ.. అధికారాన్ని కట్టబెట్టేసిన ప్రజలు.. తమలో తాము అంతర్మథనం చెందేలా మాత్రం ఉండకూడదు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న అంచనాలుఏడాది ముందు నుంచే ఉన్నాయి. కాంగ్రెస్ లాంటి ఒక పార్టీకి.. ఒక విజన్ ఉండాలి కదా? కాంగ్రెస్ విజయం సాధిస్తే.. సీఎం కుర్చీని ఎవరికి కట్టబెట్టాలి? ఆ సందర్భంలో ఎదురయ్యే ఇబ్బందులు? ఎవరికి ఎలా అదుపు చేయాలి? మాట వినని వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒప్పించటానికి ఉన్న మార్గాలు లాంటి వాటికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఎన్నికలకు ముందే సిద్ధం చేసుకోవాలి కదా?
గడిచిన తొమ్మిదేళ్లుగా విపక్షంలో ఉంటే.. ఓటమిని ఒక అలవాటుగా మార్చుకున్న పార్టీ.. తనకు పట్టిన దరిద్రం వదిలి పోవాలంటే ముందు తనను తాను మార్చుకోవాలి. మారిన తననుప్రజలు అర్థం చేసుకునేలా బిహేవ్ చేయాల్సిన అవసరంఉంది. అందుకు భిన్నంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చటం కోసం ఐదు రోజుల సమయం తీసుకోవటం అంటే.. అది దేనికి సంకేతం?
కర్ణాటకలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ పడిన కష్టం కంటే.. పార్టీ తరపున ముఖ్యమంత్రిని తేల్చటం అన్నదే పెద్ద పరీక్షగా మారిందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఇంతా చేసి.. చివరకు సాధించేది ఏమైనా ఉంటుందా? అంటే.. అదేమీ ఉండదు. అదే గ్రూపులు.. అదే లుకలుకలు.. అదే అసంత్రప్త సెగలు.. ఎంపికలో చేసే పొరపాట్లకు నవ్వుల పాలు కావటం.. కాంగ్రెస్ అంతే. అధికారం రాదు. వస్తే దాన్ని నిలుపుకోవటం చేతకాదన్న మాట పడే పరిస్థితి.
కాంగ్రెస్ కల్చర్ అని తిట్టుకునే పరిస్థితి. తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీసుకోవటం. అందుకు ఎదురయ్యే ప్రతికూలతకు సిద్ధం కావటం.. ఎవరికి ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై స్పష్టతతోనే ముందుకు వెళ్లే వీలుంది. అందుకు భిన్నంగా.. ఇలా నాన్చుడు బేరం.. మొదటికే మోసంగా మారుతుందన్న విషయాన్నిమర్చిపోకూడదు.
బీజేపీలో కనిపించని ఈ దరిద్రం.. కాంగ్రెస్ కే ఎందుకు ఉంటుందంటే.. బీజేపీలో పవర్ సెంటర్లు ఉన్నప్పటికీ.. కేంద్రంగా మాత్రం ఒకే ఒక్కటి ఉంటుంది. అదే మోడీషాలు. సంఘ్ పరివార్ సైతం తమ పాత్రను పరిమితం చేసుకోవాల్సిందే. పేరుకు జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పటికీ.. నిర్ణయాధికారం మొత్తం మోడీ చేతుల్లోనే ఉంటుంది. దీంతో.. ఆయన నిర్ణయమే ఫైనల్. అందుకు భిన్నంగా గొంతు పెంచితే.. జరిగేదేమిటో అందరికి తెలిసిందే. కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఇప్పుడు ఆ పార్టీలో సోనియా వర్గం.. రాహుల్ వర్గం.. ప్రియాంక వర్గం అంటూ మూడు పవర్ సెంటర్లు ఉన్నాయి.
కర్ణాటక ఎపిసోడ్ కు వస్తే డీకే శివకుమార్ ను సోనియా సమర్థిస్తుంటే.. సిద్దరామయ్య వైపు రాహుల్.. ప్రియాంకలు మొగ్గు చూపుతున్నారు. దీంతో.. అనవసరమైన గందరగోళం నెలకొంది. దీనికి తోడుకాంగ్రెస్ లో ఒక కల్చర్ దశాబ్దాలుగా నడుస్తోంది. రాష్ట్రాల్లో ఎవరో ఒక్కరే పవర్ ఫుల్ గా మారటం ఆ పార్టీకి ఇష్టం ఉండదు. రెండు.. మూడు పవర్ సెంటర్లను ఏర్పాటు చేసి.. పెంచి పోషిస్తుంటారు. దీనికి కారణం.. ఆ పార్టీకి ఉన్న అభద్రతా భావమే. అదే .. ఆ పార్టీ మోడీని మరింత పవర్ ఫుల్ గా మారుస్తుందని చెప్పాలి.