ఈ భారత్ కంపెనీల నిమిషం సంపాదన ఎంతంటే

Update: 2021-09-23 02:30 GMT
ఒక నెలకి ఎంత సంపాదిస్తున్నారు, ఒక్క గంట సంపాదన ఎంత. ఇలాంటి డైలాగులు సినిమాల్లో చాలా విన్నాం. కానీ అసలు మన భారతీయ కంపెనీలు ఒక్క నిమిషానికి లేదా ఒక్క గంటకు ఎంత సంపాదిస్తున్నాయి. దాంతో 2021 ఆర్థిక సంవత్సరంలో నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ లోని టాప్‌–10 కంపెనీలు(నిమిషానికి సంపాదిస్తున్న లాభం ఆధారంగా) వివరాలు తీసుకుని దీన్ని అంచనా వేశారు. అందరూ ఊహించినట్లే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇందులో మొదటి స్థానంలో నిలిచింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతి నిముషానికి 9. 34 లక్షలు ఆర్జిస్తోంది. టిసిఎస్ 6.17 లక్షలు సంపాదిస్తుంది. ఇక మూడో స్థానంలో హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు 6.05 లక్షలు ఆర్జిస్తోంది. ఎస్ బిఐ నిముషానికి 4.26 లక్షలు సంపాదిస్తుంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ 4.11 లక్షలు సంపాదిస్తుంది. ఇన్ఫోసిస్ 3.68 లక్షలు ఒక నిముషానికి సంపాదిస్తుంది. హెచ్ డి ఎఫ్ సి 3.56 లక్షలు ఆర్జిస్తోంది. ఇక ఐసీఐసీఐ బ్యాంకు ప్రతి నిముషానికి 3.49 లక్షలు సంపాదిస్తుంది. ఓఎన్ జీ సి సంస్థ నిముషానికి 3.09 లక్షలు సంపాదిస్తుంది. భారత్ పెట్రోలియం సంస్థ నిముషానికి 3.07 లక్షలు సంపాదిస్తుంది.

ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు అనగానే అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటివి ముందుగా గుర్తొస్తాయి. 21వ శతాబ్దంలో ప్రారంభమైన టెస్లా, ఫేస్ బుక్ వంటి కంపెనీలు కూడా దిగ్గజ సంస్థలకు పోటీనిస్తూ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆయా కంపెనీలు ఆర్జిస్తున్న లాభాలే ఇందుకు ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. మరి ఆ కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయంటే ,

2021 తొలి త్రైమాసికం గణాంకాల ఆధారంగా కంపెనీల ఆదాయాల వివరాలని చూస్తే ..

అమెజాన్ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆదాయం నిమిషానికి సగటున 837,330 డాలర్లుగా తెలిసింది. 2021 క్యూ1లో ఈ సంస్థ మొత్తం ఆదాయం 100 బిలియన్ డాలర్ల మార్క్ దాటడం గమనార్హం.అమెజాన్ మార్కెట్ విలువ 1.76 ట్రిలియన్ డాలర్లు.

యాపిల్: లగ్జరీ గాడ్జెట్ల తయారీ సంస్థ యాపిల్ నిమిషానికి 691,235 డాలర్లు ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది తొలి ముడు నెలల్లో యాపిల్ ఆదాయం 89.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది.యాపిల్ మార్కెట్ విలువ 2.2 ట్రిలియన్ డాలర్లు (ప్రపంచంలో అత్యధిక మార్కెట్ విలువ ఉన్న కంపెనీ ఇదే).

ఆల్ఫాబెట్ : (గూగుల్ మాతృ సంస్థ)సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నిమిషానికి 426,806 డాలర్లు సంపాదించింది.అల్ఫాబెట్ మార్కెట్ విలువ 1.6 ట్రిలియన్ డాలర్లు.

మైక్రోసాఫ్ట్ : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆదాయం నిమిషానికి 321,806 డాలర్లుగా నమోదైంది. ఇంతకు ముందుతో పోలిస్తే ఈ సంస్థ ఆదాయం కాస్త తగ్గింది.మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 1.9 ట్రిలియన్ డాలర్లు.

ఫేస్బుక్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ నిమిషానికి 201,937 డాలర్ల ఆదాయాన్ని గడించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఫేస్ బుక్ మార్కెట్ విలువ 925 బిలియన్ డాలర్లు.


Tags:    

Similar News