దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని సిత్రమైన పరిస్థితిని తెలంగాణలోని కమలనాథులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ తమ రాజకీయ ప్రత్యర్థులు ఎవరన్న విషయంలో ఒక క్లారిటీ ఉంది. కానీ.. తెలంగాణలో బీజేపీ నేతలకు ఒక పెద్ద తలనొప్పి. అధికార టీఆర్ఎస్ ను ఎప్పుడు ఎంత మేర విమర్శ చేయాలన్న విషయంలపై మొదట్నించి ఒకలాంటి అస్పష్టత ఉందన్నది తెలిసిందే.
ఇటీవల కాలంలో అలాంటిదేమీ లేదని..గులాబీ దండుతో యుద్ధానికి సిద్ధమేనని చెబుతున్నా.. అంత సీన్ లేదన్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మారే రాజకీయ సమీకరణల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ అధినాయకత్వం తొందరపడటం లేదు. అదే సమయంలో.. ప్రజల్లో తమ పట్ల అపనమ్మకం పెరగకుండా ఉండేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండు అడుగులు ముందుకు వేస్తే.. మూడు అడుగులు వెనక్కి వేస్తున్న తరహాను ప్రదర్శిస్తున్న బీజేపీ బలహీనతను గులాబీ పార్టీ ఎప్పుడో పసిగట్టింది.
తీవ్ర ఆరోపణలు.. విమర్శలు చేసినప్పుడు కొన్నిసార్లు మౌనంగా ఉండటం.. అప్పుడప్పుడు మాటకు మాట బదులుగా చెప్పటం లాంటివి అప్పుడప్పడు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒకకార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ప్రతి చిన్న విషయానికి బీజేపీ రాష్ట్ర నేతలు ఎగిరెగిరి పడుతున్నారని.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న మాట కేటీఆర్ నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారింది.వాస్తవానికి ఇటీవల కాలంలో కరోనా ఎపిసోడ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటివేళలో బీజేపీ నేతలు ఈ విషయాల్ని పెద్దగా పట్టించుకోనట్లుగా మౌనంగా ఉన్నారు. నిన్నటికి నిన్న కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గాంధీ.. టిమ్స్ ను పరిశీలించారే తప్పించి ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. మరోవైపు మంత్రి కేటీఆర్ మాత్రం బీజేపీ నేతల్ని పట్టించుకోవద్దని.. వారికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. ఆ పార్టీ నేతల మాటలకు స్పందించొద్దని స్పష్టం చేయటం గమనార్హం. ఇదంతా చూస్తున్నప్పుడు.. బీజేపీ తమ ప్రత్యర్థి కాదన్న వాదనతోపాటు.. రాష్ట్ర నాయకత్వాన్ని లైట్ తీసుకోవాలన్న సందేశాన్ని ఇవ్వటం.. కచ్ఛితంగా కమలనాథుల ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని చెప్పక తప్పదు.