ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డికి అత్యంత నమ్మిన బంటుగా, ప్రాణస్నేహితుడిగా ఏవీ సుబ్బారెడ్డికి పేరుంది. ఇరు కుటుంబాల పిల్లలు సైతం అలాగే ఉండేవారు. భూమా నాగిరెడ్డి, ఆయన భార్య శోభా నాగిరెడ్డిల గెలుపుల్లో ఏవీ సుబ్బారెడ్డిదే కీలకపాత్ర. అలాంటి ఏవీ సుబ్బారెడ్డిపై భూమా నాగిరెడ్డి కుమార్తె, మాజీ మంత్రి అఖిలప్రియ వర్గం తాజాగా దాడి చేసే వరకు వెళ్లడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.
మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఏవీ సుబ్బారెడ్డి దీర్ఘకాలం ఉన్నారు. అయితే భూమా నాగిరెడ్డి మరణించాక ఆస్తుల విషయంలో ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి కుమార్తె, మాజీ మంత్రి భూమా అఖిలప్రియల మధ్య విభేదాలు తలెత్తాయి.
ఈ విభేదాలు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న ఏవీ సుబ్బారెడ్డి హత్యకు ప్రయత్నించడం వరకు వెళ్లాయి. భూమా అఖిలప్రియ తనను చంపడానికి సుపారీ ఇచ్చిందని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2014లో ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలప్రియ ఆ తర్వాత తన తండ్రి భూమా నాగిరెడ్డితో కలసి టీడీపీలో చేరారు. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో అఖిలకు పర్యాటక మంత్రిగా చంద్రబాబు అవకాశమిచ్చారు.
మరోవైపు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో టీడీపీ కీలక నేతగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా చంద్రబాబు అవకాశమిచ్చారు.
2019లో టీడీపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన అఖిలప్రియ ఓటమిపాలయ్యారు. ఇంకోవైపు ఆమె హైదరాబాద్ లో ఒక ఆస్తి వివాదం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఘటనలో జైలుపాలయ్యారు. తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.
అంతేకాకుండా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లోనూ భూమా అఖిలప్రియ తమకు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలని బాధితులు ఆమె ఇంటి ముందు నిరసన దీక్షకు దిగారు. అఖిల బంధువులయితే ఆమె ఇంటి ముందే టెంట్ వేసుకుని నిరసన చేపట్టారు. తమ దగ్గర అప్పుగా తీసుకున్న కోట్ల రూపాయలను ఇచ్చేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ ను తనకు ఇవ్వాలని భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు, టీడీపీ నియోజకవర్గ కీలక నేత ఏవీ సుబ్బారెడ్డి చంద్రబాబును కోరినట్టు చెబుతున్నారు. అలాగే నంద్యాల టికెట్ ను తన కుమార్తె జశ్వంతికి ఇవ్వాలని విన్నవించినట్టు సమాచారం.
ఏవీ సుబ్బారెడ్డి తన కుమార్తె జశ్వంతిని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు కుమారుడికి ఇచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే.
ఏవీ సుబ్బారెడ్డి అల్లుడు కాపు సామాజికవర్గానికి చెందినవారు. దీంతో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో దాదాపు 30 వేల చొప్పున ఉన్న కాపుల ఓట్లు తమకే పడతాయని ఏవీ సుబ్బారెడ్డి చంద్రబాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అఖిలప్రియ అప్పులపాలైందని, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె వద్ద డబ్బులు లేవని, ఆమెపై చాలా కేసులు ఉన్నాయని ఏవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు సమాచారం. ఆమెకు సీటు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని విన్నవించినట్టు చెబుతున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో తమ కుటుంబానికి పోటీగా వస్తున్న ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్ర నంద్యాల జిల్లాలోకి ప్రవేశించింది. ఆయనకు స్వాగతం పలకడానికి బండి ఆత్మకూరు సమీపంలోని కొత్తపల్లి వద్దకు అటు ఏవీ సుబ్బారెడ్డి, ఇటు అఖిలప్రియ తమ వర్గాలతో రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అఖిలప్రియ అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిని రక్తం వచ్చేటట్టు కొట్టడం వరకు వెళ్లింది. ఈ ఘటనలో పోలీసులు అఖిలప్రియను అరెస్టు చేశారు.