దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో బ్లాక్ ఫంగస్ అందరిని ఆందోళనకి గురి చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నుండి ఎలాగోలా కోలుకున్నా కూడా బ్లాక్ ఫంగస్ భారిన పడి అనేకమంది ప్రాణాలు వదిలారు. దీనితో బ్లాక్ ఫంగస్ పై ఎక్కువ భయం అనేది ఏర్పడింది. చాలా రాష్ట్రాలు దీనిని అంటువ్యాధిగా ప్రకటించాయి. అలాగే ఈ బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం మధుమేహం, కరోనా వైరస్ కి ట్రీట్మెంట్ సమయంలో స్టెరాయిడ్స్ అధికంగా వాడడం అనే అభిప్రాయం గత కొన్ని రోజులుగా ఉంది. కానీ , కొద్దిమందికి మాత్రమే అలా కరోనా చికిత్స వల్ల సోకుతోందని, బాధితుల్లో చాలా మందికి మధుమేహం లేదని, స్టెరాయిడ్స్ వాడలేదని, వైద్య, ఆరోగ్య శాఖ తాజా అధ్యయనంలో తేలినట్టు అధికారులు తెలిపారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ కేసులతోపాటు మ్యూకర్ మైకోసిస్ కేసులు కూడా ఎక్కువగా భయపెట్టిన సంగతి తెలిసిందే. దీనితో వైద్య ఆరోగ్య శాఖ మొత్తం 1162 మంది బ్లాక్ ఫంగస్ బాధితులపై అధ్యయనం చేసింది. వారిలో 303 మందికి, అంటే 26 శాతం మందికి అసలు మధుమేహమే లేదని, అలాగే మరో 27 శాతం మంది ఎటువంటి స్టెరాయిడ్స్ వాడలేదని వెల్లడైంది. కరోనా వల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడంతోనే వారికి బ్లాక్ ఫంగస్ సోకి ఉంటుందని వైద్య శాఖ ఒక అంచనాకు వచ్చింది. దీనితో పాటు అసలు కరోనానే రాని మరో 11 మందికి కూడా బ్లాక్ ఫంగస్ వచ్చినట్లు అధ్యయనంలో వెల్లడైంది. 1162 మంది బాధితుల్లో ఐదేళ్లలోపు చిన్నారులు ఏడుగురున్నారు. వారెవరికీ కరోనా సోకలేదు. మధ్యవయసువారికి ఈ సమస్య ఎక్కువగా వచ్చినట్టు తేలింది. దీనితో మ్యూకర్ మైకోసిస్ రావడానికి షుగర్, స్టెరాయిడ్స్ ప్రధాన కారణాలు కావనే అంచనాకు వైద్యనిపుణులు వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గినప్పటికీ బ్లాక్ ఫంగస్ కేసులు రోజుకు పదుల సంఖ్యలో వస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. కోఠి ఈఎన్ టీ ఆస్పత్రిలో రెండు రోజుల్లో 31 మంది బ్లాక్ ఫంగస్ రోగులు చేరారు. ఈఎన్ టీలో ప్రస్తుతం 150 మందికి చిక్సిత అందిస్తున్నారు. గాంధీలో సుమారు ఐదొందల మంది అడ్మిట్ అవ్వగా, 150 మంది డిశ్చార్జ్ అయ్యారు. 320 మంది రోగులకు ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు.