తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై హ్యాకర్లు దాడి చేశారా? అందుకే పలు పరీక్షల పేపర్స్ లీక్ అయ్యాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఎందుకంటే హ్యాకింగ్ జరిగిందనే అనుమానంతో రెండు నియామక పరీక్షలను వాయిదా వేసినట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం సెక్రటరీ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈనెల 12న టీపీబీవో పోస్టులకు నిర్వహించాల్సిన రాత పరీక్షను 15, 16వ తేదీల్లో జరాగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. పరీక్షలకు సంబంధించిన కంప్యూటర్ హ్యాక్ అయ్యిందని అనుమానం ఉన్నట్టు పేర్కొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారని స్పష్టం చేశారు. వాయిదా పడిన పరీక్షలను తేదీలను మళ్లీ ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు.
వాస్తవానికి టీఎస్ పీఎస్సీ కంప్యూటర్ల నుంచి అత్యంత రహస్య సమాచారం లీకైందన్న విషయాన్ని ఓ యువకుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. దీంతో పోలీసులు కమిషనర్ కార్యాలయానికి వచ్చి కంప్యూటర్లు హ్యాకింగ్ అయినట్లు సమాచారం ఉందని.. ఒకసారి లాగిన్ వివరాలు చూసుకోవాలని సూచించారు. దీంతో కమిషన్ అధికారులు కంప్యూటర్లను ఇతరులు తెరిచినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో టీఎస్.పీఎస్సీ అధికారులు బేగంబజార్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అత్యంత రహస్యమైన సమాచారం లీకైనట్లు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాధారణంగా కమిషన్ లో అత్యంత రహస్య సమాచారం కీలకమైన హోదాల్లో ఉన్న వారి వద్ద ఉంటుంది. వారి లాగిన్ వివరాలతో ఎవరు కంప్యూటర్లను తెరిచారు? అందులో ఏ సమాచారం చూశారు అనే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు సమాచారం. కమిషన్ సిబ్బంది పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.