ఉత్తరాంధ్ర.. తెలుగు దేశం పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి కంచుకోట.. గెలిచినా.. ఓడినా మెజార్టీ స్థానాలు అక్కడ టీడీపీ దక్కించుకుంటుంది. కానీ ఈసారి మాత్రం ట్రెయిన్ రివర్స్ అయ్యింది. టీడీపీ కంచుకోటను వైసీపీ బద్దలు కొట్టింది. బద్దలు కొట్టడం కాదు.. ఏకంగా సునామీనే సృష్టించింది. ఉత్తరాంధ్రలోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్లో 28 చోట్ల వైసీపీ గెలుపుబావుటా ఎగురవేసిందంటే అది మామూలు విషయం కాదు..
నిజానికి 2014లో జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర టీడీపీకి మద్దతుగా నిలవడమే.. బలమైన టీడీపీని ఇక్కడ ఓడించడానికి వైసీపీ అధినేత నాలుగేళ్లుగా వ్యూహాలు రచించాడు. బలమైన నాయకులను కొత్త యువతను సమీకరించారు. క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేశారు. దీంతో జగన్ కష్టం ఫలించింది. ఇటు బలంగా ఉన్న రాయలసీమ నుంచి అటు టీడీపీ బలంగా ఉన్న ఉత్తరాంధ్ర వరకూ వైసీపీ గాలి వీచింది. గోదావరి జిల్లాల్లో కూడా టీడీపీ చాప చుట్టేసింది.
అయితే బలం ఉన్న రాయలసీమలో గెలవడం జగన్ కు ఈజీనే.. బలం లేని ఉత్తరాంధ్రలో కూడా మెజార్టీ సీట్లు కట్టబెట్టిన ప్రజలు, నాయకులు ఇప్పుడు జగన్ వైపు చూస్తున్నారు. అక్కడ గెలిచిన మెజార్టీ ఎమ్మెల్యేల్లో ఎంతమందికి జగన్ మంత్రి పదవులు ఇస్తారు. ఆయా సామాజికవర్గాలను ఎలా సంతృప్తి పరుస్తారు.. ఇక్కడ టీడీపీ ఎదగకుండా ఎలాంటి వ్యూహరచనలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. మళ్లీ అక్కడ టీడీపీ పురుడు పోసుకోకుండా బలమైన మంత్రులను నియమించాలని జగన్ యోచిస్తున్నారు.
ప్రధానంగా విశాఖ జిల్లాలో చూస్తే మంత్రి పదవి హామీ పొందిన తర్వాతే భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ మంత్రి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు. ఇక గాజువాకలో జనసేనాని పవన్ ను ఓడించిన తిప్పల నాగిరెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నాడట.. నర్సీపట్నంలో అయ్యన్నను ఓడించిన ఉమాశంకర్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఇక పాయకరావుపేటలో వరుసగా గెలుస్తున్న గొల్ల బాబూరావు కూడా సీనియర్ కోటా లో మంత్రి పదవి ఆశిస్తున్నాడు.
ఇక విజయనగరం జిల్లా చూస్తే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మంత్రి పదవుల రేసులో ముందున్నారు. ఇక బొబ్బిలిలో గెలిచిన అప్పలనాయుడు మంత్రి పదవి ఆశిస్తున్నాడు. ఎస్టీ కోటాలో రాజన్న దొర కూడా పదవి ఆశిస్తున్నాడు. శ్రీకాకుళంలో సీనియర్ నేత ధర్మాన ప్రసాద్రావు మంత్రి పదవుల రేసులో అందరికంటే వరుసలో ఉన్నారు.. ఇక సీనియర్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం కూడా మంత్రి పదవి ఖాయమని నమ్ముతున్నారు. రాజా ఎమ్మెల్యే జోగులు ఎస్సీ కోటపై ఆశలు పెంచుకున్నారు.
ఇలా ఆశావహుల సంఖ్య ఉత్తరాంధ్ర నుంచి చాంతాడంత ఉంది. మరి అన్ని సామాజికవర్గాలు.. అందరు నేతలను సంతృప్తి తెరిచేలా జగన్ ఎలా కేటాయింపులు చేస్తారు? మళ్లీ టీడీపీ పురుడు పోసుకోకుండా ఎలా మేనేజ్ చేస్తాడన్నది ఆసక్తి గా మారింది.