మీడియాను అధిగమించిన సోషల్ మీడియా.. ఇప్పుడు మొయిన్ స్ట్రీమ్ మీడియాను అమితంగా ప్రభావితం చేస్తోంది. అందులో భాగంగానే పాకిస్థాన్ దేశాన్ని టెస్లా అధినేత ఎలన్ మాస్క్ కొనుగోలు చేయటమేనన్న వ్యాఖ్య రావటానికి కారణంగా చెప్పాలి. ఇంతకీ ఇదంతా ఎలా మొదలైంది? అన్న విషయంలోకి వెళితే.. ఎలన్ మాస్క్ కు చెందిన టెస్లా షేరు ధర భారీగా పెరిగి.. ఆయన సంపద మరింత పెరిగిన వేళ ఈ ప్రచారం తెర మీదకు వచ్చింది.
కొద్ది రోజుల క్రితం హెర్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ అనే కారు రెంటల్ సంస్థ లక్ష టెస్లా కార్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. దీంతో.. టెస్లా షేరు విలువ ఒక్కసారిగా ఎగిసిపడింది. దీంతో అక్టోబరు 25 నాటికి మార్కెట్ ట్రేడింగ్ లో టెస్లా కంపెనీ షేర్ విలువ భారీగా పెరిగి ఆయన సంపద 300 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒక్క రోజులోనే 36 బిలియన్ డాలర్ల సంపద ఆయన సొంతమైంది. దీంతో.. ఈ విషయాన్ని కాస్త భిన్నంగా చెప్పే క్రమంలో.. ఎలన్ మస్క్ సంపద పాకిస్థాన్ జీడీపీ కంటే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.
బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్్ ప్రకారం ప్రస్తుతం ఎలన్ మస్క్ నికర సంపద విలువ 311 బిలియన్ డాలర్లుగా ఉందని.. 220 మిలియన్ల జనాభా ఉన్న పాక్ జీడీపీ కేవలం 280 బిలియన్ డాలర్లుగా ఉందని చెబుతున్నారు. అంటే.. టెస్లా అధినేత సంపద పాక్ కంటే సుమారు 31 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉందని అమెరికాకు చెందిన కిలమిస్ట్ ఎడ్వర్డ్ లూయిస్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
ఎడ్వర్డ్ ట్వీట్ ను పలువురు రీట్వీట్ చేస్తున్నారు. అయితే.. జాతీయ పురస్కార విజేతల్లో ఒకరిగా నిలిచిన నిర్మాత రమేశ్ శర్మ తనదైన శైలిలో రియాక్టు అయ్యారు. ఆయన సదరు ట్వీట్ కు రిప్లే ఇస్తూ.. ‘ఎలన్ మస్క్ పాకిస్థాన్’ను కొనేస్తారా? అంటూ సరదాగా ప్రశ్నించారు. దీనికి ఎడ్వర్డ్ లూయిస్ బదులిచ్చారు. ఒకవేళ ఎలన్ మస్క్ అదే చేస్తే.. అతని దగ్గర ఏమీ మిగలదని.. చిరాకులో ఉన్న 220 మిలియన్ ప్రజలు దక్కుతారని.. కాకుంటే ఒక మంచి టీ20 టీం మాత్రం దక్కుతుందని చేసిన ట్వీట్ ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తోంది.