అడుసు తొక్కనేల .. కాలు కడగనేల.. ఒక సామెత ఉంది. తప్పు చేశామని తెలుసుకుని.. ఆ తప్పు సరిదిద్దు కునే ప్రయత్నం చేయడం సహజం. ఎందుకంటే.. నాయకులను బట్టే.. సమాజం ఏర్పడుతుంది.. భావి తరం నిర్దేశించబడుతుంది.. ఇది గత మేటి నాయకులు.. పాలకులు చెప్పిన నిష్ఠుర సత్యం. అయితే.. నేటి నేతలు గాడి తప్పుతున్నారు. తప్పులు చేయడమే కాదు.. చేసిన తప్పులను సమర్థించుకుని.. అయితే ఏంటి? అనే ప్రశ్నలు వేస్తున్నారు.
ఇంతటితోనే అయిపోలేదు.. తప్పులు చేయని వారు ఎవరు? అంటూ ప్రశ్నిస్తున్నారు. సమాజానికి దిశాని ర్దేశ కులుగా మారాల్సిన నాయకులు ఏమాత్రం తడుముకోకుండా.. తాము చేసింది తప్పుకాదని కూడా చెప్పే స్తున్నారు. ఈ వారంలో జరిగిన రెండు ఘటనలను పరిశీలిస్తే.. ప్రజలు ఈ నేతలు ఏం చెబుతున్నా రా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో తన పేరు ఉందనే విషయంపై సీఎం కేసీఆర్ తనయ స్పందించిన తీరు.. అందరినీ విస్మయానికి గురి చేసింది. "ఆ.. పేరు వస్తే.. రాని.. ఏం చేస్తారు ఉరేస్తారా? పెడితే జైల్లో పెడతారు!" అనడం.. కనీసం పశ్చాత్తాపాన్ని కూడా ప్రదర్శించలేకపోవడం.. ప్రజాస్వామ్య వాదులను నిశ్చేష్ఠులను చేసింది.
ఇక, ఇదే కేసులో పేరు తెరమీదకి వచ్చిన వైసీపీ నాయకులు ఎంపీ మాగుంట కూడా ఇదే విధంగా స్పందించారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి మీడియా ముందుకు రాకపోయినా.. తన అనుచరుల దగ్గర ఇవే వ్యాఖ్యలు చేశారు. పేరు వచ్చినంత మాత్రాన నేను దొంగనా అని ఆయన వ్యాఖ్యానించినట్టు వైసీపీ నాయకులే చెబుతున్నారు.
ఇక, తెలంగాణకే చెందిన మంత్రి మల్లారెడ్డి తన ఇంటిపైనా విద్యాసంస్థల కార్యాలయాలపైనా ఐటీ చేసిన దాడులను లైట్‌గా తీసుకోవడమే కాకుండా.. బీఆర్ ఎస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఐటీ మాటే ఉండదని వ్యాఖ్యానించడం బరితెగింపు కాదా? ఎవరైనా ఎంతైనా సంపాంచుకుని, వారే తోచినంత పన్ను కట్టేలా చట్టసరవణ చేస్తామనడం.. ఏమనుకోవాలి?!
ఇక, ఏపీ పరిణామాలను గమనిస్తే.. అమరావతి రాజధాని విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా.. ఏమాత్రం దానికి పూచీ వహించని వైసీపీ పెద్దలు.. మూడు రాజధానులకు తమకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టేనని పేర్కొనడం.. న్యాయవ్యవస్థపై ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించి ఉన్నారా? అనేది మరోప్రశ్న. మరివీరంతా నాయకులు.. భావి తరాలకు నేతలకు. ప్రస్తుత తరానికివారధులు.. మరి వీరిని ఏం చేద్దాం..!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.