వైజాగ్‌ లో బాబు లాగే పవన్ కు అవమానమా?

Update: 2020-09-14 01:30 GMT
కరోనా లాక్ డౌన్ కాలంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. రాజకీయాల్లో యాక్టివ్ గా లేకుండా పోయారు. ఈ క్రమంలోనే కఠినమైన ‘చతుర్మాసా దీక్ష’ను చేపట్టారు. దాని ప్రకారం ఆయన ఎక్కడికి వెళ్లడం లేదు. పర్యటించడం లేదు.  తాజాగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైజాగ్ పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్లు జనసేన పార్టీ తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

జనసేనాని పవన్ అతి త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అందులో భాగంగా, పవన్ వైజాగ్ ప్రాంతంలో పెద్ద సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యారట.. నాయకులందరినీ కలుస్తానని వాగ్దానం చేసినట్లు తెలిసింది.

గత సంవత్సరం, పవన్ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి గాను వైజాగ్ వచ్చి హల్ చల్ చేశారు. ఆ తరువాత ఇప్పటివరకు వైజాగ్ కు రాలేదు.

ఇంతలో, కరోనా వైరస్ ప్రబలడంతో పవన్ హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఏపీలో పవన్ అడుగుపెట్టి ఆరు నెలలు అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో  గాజువాక  నియోజకవర్గంలో పవన్ ఓడిపోయినప్పటి నుంచి  విశాఖ రావడానికి పవన్ ఆసక్తి చూపడం లేదని పార్టీ సభ్యులు భావిస్తున్నారు.

 పవన్ కళ్యాణ్ అమరావతి రాజధానికే జైకొట్టారు. వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలన్న వైసిపి నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. పవన్ విశాఖ ప్రాంతంలోని జనసేన కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. దీనిని బట్టి, పవన్ విశాఖలో పర్యటిస్తే ఫ్యాన్స్ ప్రజలు ఎలా స్వీకరిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. గతంలో, వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలన్న వైసిపి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించినప్పుడు తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాబు విశాఖ పర్యటనను ప్లాన్ చేసినప్పుడు, అతడిని ప్రజా స్వచ్ఛంద సంఘాలు వైజాగ్ విమానాశ్రయంలోనే అడ్డుకున్నాయి.

చంద్రబాబు  అదే వచ్చిన ఫ్లైట్ లోనే తిరిగి  వెళ్లిపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం అలానే వెళ్లిపోతారా? లేదా అనేది ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Tags:    

Similar News