గత కొంత కాలంగా పెట్రోల్ ధరలు పెరగడం అనేది సామాన్యులను కలవర పెట్టింది. రోజు వారి 30 నుంచి 40 పైసల వరకూ పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకుంటూ వచ్చాయి. దీంతో అతి తక్కువ కాలంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి. పెట్రో ధరల వడ్డన అనేది నిత్యకృత్యంగా మారిందని చాలామంది సామాన్యులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై ఐదు రూపాయిలు, డీజిల్పై పది రూపాయిలు వరకు ఎక్సైజ్ ట్యాక్స్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం మరుసటి రోజు నుంచే అమలు లోకి వస్తుందని స్పష్టంగా పేర్కొంది. దీంతో వాహన వినియోగదారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నిర్ణయం వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే దేశంలోని కొన్ని భాజపాపాలిత రాష్ట్రాలు మరో నిర్ణయం తీసుకున్నాయి. అదే రాష్ట్రాలు ముక్కుపిండి వసూలు చేసే వ్యాట్ని కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆయా రాష్ట్రాలు వారికి భారీ ఉపశమనం లభించినట్లు అయింది. ఇదిలా ఉంటే మరోవైపు భాజపాయేతర రాష్ట్రాలు పెట్రోల్ ధర తగ్గింపుపై చడీచప్పుడు చేయకుండా ఉన్నాయి.
నిజానికి పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు విషయంలో పెద్ద చర్చే నడించింది. కేవలం ఉపఎన్నికలు ఉంటేనే రేట్లు పెరగబోవని... మిగతా సమయాల్లో సేమ్ టూ సేమ్ అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ మాటలను నిజం చేస్తూ.. కేంద్రం ఎన్నికలు పూర్తి అవగానే మరలా ధరల వడ్డన కార్యక్రమానికి తెరతీయడం తెలిసిందే. అయితే కేంద్ర ట్యాక్స్ను తగ్గిస్తూ చెప్పుకొచ్చిన మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు, భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకని పదేపదే చెప్పింది మోదీ సర్కారు. దీనినే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా ప్రభుత్వానికి నివేదించారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటితే... ఆ భారం సరాసరి పేద, మధ్యతరగతి వారి మీద పడుతుందని పేర్కొన్నారు. అంతేగాకుండా.. దేశంలోని తయారీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే కేంద్రానికి వచ్చే ఎన్నికల్లో గడ్డుపరిస్థితి ఏర్పడడం ఖాయం అని నిపుణులు చెప్తున్నారు. ఈ వాదనలతోనే కేంద్రం వెనక్కి తగ్గిందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు పెట్రోల్ ధరల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి అంటే ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమే అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు మోదీ సర్కారు ఇంధనంపై వసూలు చేసిన మొత్తం రూ.36.17 లక్షలు కోట్లు కాగా ఇదంతా కేవలం వారు మధ్యతరగతి ప్రజల జేబుల నుంచి పిండుకున్నదే అని అంటున్నారు. అదే జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చినట్లు అయితే అత్యధికంగా విధించే శ్లాబులోకి తీసుకువచ్చినా.. ఆ స్థాయిలో ధరలు పెరిగేందుకు అవకాశం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
నిజానికి పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు విషయంలో పెద్ద చర్చే నడించింది. కేవలం ఉపఎన్నికలు ఉంటేనే రేట్లు పెరగబోవని... మిగతా సమయాల్లో సేమ్ టూ సేమ్ అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ మాటలను నిజం చేస్తూ.. కేంద్రం ఎన్నికలు పూర్తి అవగానే మరలా ధరల వడ్డన కార్యక్రమానికి తెరతీయడం తెలిసిందే. అయితే కేంద్ర ట్యాక్స్ను తగ్గిస్తూ చెప్పుకొచ్చిన మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు, భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకని పదేపదే చెప్పింది మోదీ సర్కారు. దీనినే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా ప్రభుత్వానికి నివేదించారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటితే... ఆ భారం సరాసరి పేద, మధ్యతరగతి వారి మీద పడుతుందని పేర్కొన్నారు. అంతేగాకుండా.. దేశంలోని తయారీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే కేంద్రానికి వచ్చే ఎన్నికల్లో గడ్డుపరిస్థితి ఏర్పడడం ఖాయం అని నిపుణులు చెప్తున్నారు. ఈ వాదనలతోనే కేంద్రం వెనక్కి తగ్గిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకూ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం వెనకేసుకొచ్చింది. సంక్షేమ పథకాలు సామాన్యులకు అందాలి అంటే పెట్రోల్పై వచ్చే ఆదాయమే ప్రధాన వనరు అని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్పూరి చెప్పుకొచ్చారు. సుంకాలను తగ్గిస్తే.. మన కాళ్లను నరుక్కోవడమే అని కూడా వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ప్రజానీకం విలవిలలాడుతుంటే కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇలాంటి చిత్తసుద్ధితో ముందుకు వచ్చి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.