దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి.. పురుట్చితలైవి.. జయలలితకు సంబంధించిన ఆసక్తికర అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డీహైడ్రేషన్.. జ్వరంతో చెన్నై అపోలోలో చేరిన ఆమె.. తర్వాతి కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురి కావటం.. ఆపై వరుసగా ఒకటి తర్వాత ఒకటిగా వచ్చిపడిన ఆరోగ్య సమస్యలతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా చెబుతారు. ఆమెను రక్షించేందుకు.. అత్యుత్తమ వైద్యుల్ని రప్పించి వైద్యం చేయించినా.. 74 రోజుల పోరాటం తర్వాత ఆమె మృత్యుఒడిలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
అపోలో ఆసుపత్రిలో ఉన్న 74 రోజుల్లో ఆమె ఎక్కువ రోజులు ఐసీయూలోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎలా ఉన్నారు? వైద్యులతో.. నర్సులతో ఆమె ఎలా వ్యవహరించే వారు? లాంటి ఆసక్తికర అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అపోలో ఆసుపత్రి వైస్ ఛైర్మన్ డాక్టర్ ప్రీతారెడ్డి చెప్పిన మాటల్నే తీసుకుంటే నిజమా అని అనిపించక మానదు. ఎందుకంటే.. తీవ్ర అనారోగ్యంతో ఉన్నఅమ్మ.. ఐసీయూలో ఉన్నప్పుడు వైద్యులతో.. నర్సులతో సరదాగా మాట్లాడేవారని.. జోకులు వేసే వారిని చెప్పుకొచ్చారు.
‘‘ఆమెలో హాస్య చతురత ఎక్కువ. విపరీతంగా జోకులు వేసేవారు. ఆమె వేసే జోకులకు నర్సులు పెద్దగా నవ్వేసేవారు. ఆమె ఎంతో మంచి సహృదయురాలు’’ అని చెప్పిన మాటలు వింటే విస్మయం చెందాల్సిందే. ఎందుకంటే.. పలుకే బంగారమా అన్నట్లుగా ఉంటూ.. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆమెలో ఇలాంటి కోణం ఒకటి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసని చెప్పాలి. అమ్మకు వైద్యం చేస్తున్న సమయంలో ఆమెకు వైద్యం చేసిన వైద్యులు తీవ్ర ఒత్తిడికి గురి అయ్యేవారని.. లక్షలాది మంది ఆకాంక్షను నెరవేర్చాలన్న ఆరాటంతో పని చేసినట్లు ఆమె వెల్లడించారు. జయలలిత లేరన్న విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రిలోని నర్సులంతా బోరున విలపించారని ఆమె చెప్పారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో.. తనకు వైద్యం చేస్తున్న వారి పట్ల అమ్మ వ్యవహరించిన తీరు గురించి వింటున్నకొద్దీ ఆమెపై అభిమానం మరింత పెరగటం ఖాయం.