పంజాబ్‌లోని దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకూ పది మంది మృతి చెందారు. ఇందులో ఏడుగురు పోలీసులు కాగా.. ముగ్గురు సాధారణ పౌరులు. పెద్ద ఎత్తున గాయాల పాలయ్యారు. తాజా దాడి చేసింది లష్కరే తోయిబా.. జేషే మహ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదుల పనిగా భద్రతాధికారులు చెబుతున్నారు.
సోమవారం తెల్లవారుజామున రెస్టారెంట్ యజమాని కారును దొంగలించి.. అనంతరం దీనానగర్ పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడటం తెలిసిందే. మరి.. ఈ ఉగ్రవాదులు పాక్ నుంచి భారత్ లోకి ఎప్పుడు ప్రవేశించి ఉంటారన్నది ఒక ప్రశ్నగా మారింది.
సోమవారం ఉదయమే వచ్చి ఉంటారా? అంటే.. లేదనే వాదన వినిపిస్తోంది. దీనికి అదికారులు చెబుతున్న మాటేమిటంటే.. ఒకవేళ ఉదయమే వారు పాక్ నుంచి వచ్చి ఉంటే.. గురుదాస్‌పూర్ రైల్వే ట్రాక్ వద్ద బాంబులు పెట్టటం లాంటివి కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్మీ దుస్తులతో వారు తెగబడిన తీరు చూసినప్పుడు.. వారు కొద్ది రోజుల ముందే భారత్‌కు వచ్చి.. దాడికి తెగబడి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది.
మరోవైపు.. ఇదే అంశానికి సంబంధించి మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఉగ్రదాడి.. భారీ విధ్వంసమే అయినప్పుడు.. పోలీస్ స్టేషన్ మీద దాడి చేయటం.. కాల్పులు జరపటం..అది కూడా ఉదయాన్నే అన్న నేపథ్యంలో.. వారు పాక్ నుంచి ఆదివారమే బయలుదేరి ఉండొచ్చని.. సరిహద్దు దాటిన మరుక్షణమే.. తమ విధ్వంసాన్ని మొదలు పెట్టి ఉంటారన్న చెబుతున్నారు.
రైల్వే ట్రాక్ మీద బాంబులు పెట్టటం.. మరోవైపు పోలీస్ స్టేషన్ పై దాడి చేయటం చూసినప్పుడు.. పోలీసుల్లో ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేయటం.. దృష్టిమర్చలటం ద్వారా.. రైల్వే ట్రాక్ మీద బాంబులు పేల్చటం ద్వారా భారీ విధ్వంసానికి వ్యూహ రచన చేసి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా.. ముందస్తుగా వచ్చే కన్నా.. సోమవారం తెల్లవారు జాము ప్రాంతంలోనే వారు భారత్ లోకి ప్రవేశించి ఉంటారని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఈ వాదనలన్నీ ప్రాధమిక అభిప్రాయాలే తప్ప పక్కా కాదు. భద్రతాధికారులు మరింత లోతుగా పరిశీలించటం ద్వారా.. అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.