అవాక్కు అయ్యే మాటల్ని అసువుగా చెప్పేయటం అందరికి సాధ్యం కాదు. ఇలాంటి విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించిన మొనగాళ్లు మరెవరూ ఉండరు. విషయం ఏదైనా సరే.. తాను కన్వీన్స్ అయితే అందరిని కన్వీన్స్ చేసేందుకు ఎంతలా కసరత్తు చేస్తారో.. తనకు నచ్చని వాటికి సంబంధించి రెట్టింపు కసితో మాటలు చెప్పటం కేసీఆర్ కు కొత్తేం కాదు. ఆ మాటకు వస్తే.. ఆయన కొత్త వాటి మీద ఉండే ఆసక్తి.. మోజు అంతా ఇంతా కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. తాను ముఖ్యమంత్రి అయ్యాక.. అప్పటికే ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి బదులుగా.. తన అభిరుచికి తగ్గట్లు ప్రగతి భవన్ కట్టించుకోవటం తెలిసిందే.
తాను నిత్యం వెళ్లాల్సిన సెక్రటేరియట్ తన ఆసక్తులకు అనుగుణంగా లేని నేపథ్యంలో.. దానికి వెళ్లకుండా మానేసిన ఆయన.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియట్ అన్నట్లుగా విషయాన్ని తీసుకొచ్చి.. చివరకు ఉన్న భవనాల్ని నిలువునా కూల్చేసి.. వందల కోట్ల ఖర్చుతో కొత్త సెక్రటేరియట్ ను తన ఆసక్తులకు అనుగుణంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ధరణి పోర్టల్ పెట్టిన ఆయన.. చక్కగా సాగే రిజిస్ట్రేషన్ ను ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో తెలిసిందే. కొత్తగా తీసుకొచ్చిన ధరణితో ప్రజలు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు.
ఏదైనా సరే.. పాత ఒక రోత.. కొత్తొక మోజుగా వ్యవహరించే కేసీఆర్ పుణ్యమా అని ప్రజల మీద పడే భారాన్ని ఆయన పెద్దగా పట్టించుకోరు. వారికి ఎదురయ్యే కష్టాల గురించి ఆలోచించరన్నఆరోపణ ఆయన మీద ఉంది. ఇప్పుడీ కొత్త మోజు.. రాజ్యాంగం వరకు వెళ్లటం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇపప్పుడున్న రాజ్యాంగంతో ప్రజలు ఆశించినంత విధంగా పాలన సాగటం లేదని.. అందుకే దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమన్న ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారనున్నాయి. ఇలాంటి మాటల్ని విన్నప్పుడు అనిపించేది ఒక్కటే.. ఉన్న వాటిని సమర్థంగా వాడటం లేదంటే ఉన్న లోపాల్నిసరిచేసి.. మరింత పక్కాగా చేయటం బాగుంటుంది. అంతేకానీ.. ప్రతి దాన్ని మార్చేసుకుంటూ పోతే.. విసుగు చెందిన ప్రజలు పాలకుల్ని మార్చేస్తారన్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారంటారు?