ఆంధ్రప్రదేశ్ లో మరో 14 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మరోవైపు తాను కూడా రేసులో ఉన్నానంటూ జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయి నుంచి అంటే గ్రామాల్లో వార్డు స్థాయి నుంచి తమ తమ పార్టీలను చొచ్చుకువెళ్లేలా వైసీపీ, టీడీపీ వ్యూహాలు రచించాయి. ఇప్పటికే వైసీపీ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇంచార్జిలను 175 నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిప్పుతోంది. దాదాపు ఏడు నెలల క్రితమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం పూర్తి కావొచ్చింది.
దీంతో ప్రస్తుతం ఉన్న వలంటీర్ల తరహాలోనే గృహసారథులు అనే కొత్త కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహసారథులను నియమించింది. అలాగే ప్రతి సచివాలయానికి ఒక కన్వీనర్ ను కూడా నియమించింది. గృహసారథులు తమకు నిర్దేశించిన ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? ఇంకా ఏమైనా ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారా? పార్టీకి ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు బాగుందా? లేదా? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయబోతున్నారు... ఇలా అన్ని విషయాలను తెలుసుకోబోతున్నారు.
ఇక టీడీపీ సైతం వైసీపీకి పోటీగా సంక్షేమ సాధికార సారథులను నియమిస్తోంది. వైసీపీ ప్రతి 50 ఇళ్లకు గృహసారథులను నియమిస్తే టీడీపీ ప్రతి 30 ఇళ్లకు సంక్షేమ సాధికార సారథులను తెస్తోంది.
టీడీపీ సంక్షేమ సారథులు కూడా తమకు నిర్దేశించిన ఇళ్లకు వెళ్లి టీడీపీ పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు గురించి వివరించనున్నారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించనున్నారు. అలాగే పార్టీ పరంగా చేపట్టాల్సిన పనులు, కార్యక్రమాల గురించి వివరాలు సేకరించనున్నారు. ఆయా కుటుంబాల్లో ఎంత మంది ఉన్నారు? ఏం చేస్తున్నారు? ప్రభుత్వంపైన వారికి అసంతృప్తి ఉందా? స్థానిక టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి లేదా ఎమ్మెల్యేపై మీ అభిప్రాయం.. ఇలా అన్ని వివరాలను సేకరించనున్నారు.
అదేవిధంగా ఆయా కుటుంబాల్లోనివారు ఉద్యోగం చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారా? వ్యవసాయం చేస్తున్నారా? చదువుకుంటున్నారా? ఇలా అన్ని వివరాలను సంక్షేమ సాధికార సారథులు తెలుసుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పోలింగ్ బూతులవారీగా జనాలను తీసుకొచ్చి ఓట్లేయించాల్సిన బాధ్యతలను కూడా సంక్షేమ సాధికార సారథులకే కట్టబెట్టనున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే సంక్షేమ సాధికార సారథులను ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు అందించడానికి తీసుకుంటామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. గతంలో కార్యకర్తలకు తాను ఏం చేయలేకపోయానని, ఈసారి అలా జరగదన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసీపీ గృహ సారథులు విజయవంతమవుతారో లేక టీడీపీ సంక్షేమ సాధికార సారథులు సక్సెస్ అవుతారో వేచిచూడాల్సిందే!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.