వలసదారులకు ట్రంప్ మరో షాక్

Update: 2017-01-31 04:42 GMT
ఏడు ముస్లిం మెజార్టీ దేశాల ప్రజలు అమెరికాలోకి అనుమతించే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అటు అమెరికాలోనూ.. ఇటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్నిరేపుతున్న విషయం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా మరికొన్ని కొత్త విషయాల్ని ఇందులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది.. మరింత కాక పుట్టేలా చేయటమే కాదు.. ట్రంప్ పై వ్యతిరేకత పెంచే వీలుందని చెబుతున్నారు.

ఏడు ముస్లిం మెజార్టీ (ఇరాక్.. సిరియా.. ఇరాన్.. లిబియా.. సొమాలియా.. సుడాన్.. యెమెన్) దేశాల నుంచి అమెరికాకు వచ్చే వలదారులపై అమెరికా విధించిన ఆంక్షల ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల నిరసనల సెగ తగ్గక ముందే మరిన్ని నిర్ణయాల దిశగా ట్రంప్ సర్కారు అడుగులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అమెరికాలోకి ప్రవేశించే సదరు ఏడు దేశాలకు చెందిన పౌరులు తమ ఫోన్ నెంబరుతో పాటు.. వారి సోషల్ మీడియా డిటైల్స్ తో పాటు బ్రౌజింగ్ హిస్టరీని అందజేయాలన్న షరతును విధించాలన్న దిశగా చర్చలు జరుగుతున్నాయి.

ఒకవేళ అదే నిర్ణయం అధికారికం అయితే.. ఈ నిర్ణయం మరిన్ని విమర్శలకు తావిచ్చే వీలుందని చెబుతున్నారు. ఎందుకంటే.. ట్రంప్ సర్కారు కోరాలని భావిస్తున్న వివరాలన్నీ ఇచ్చిన పక్షంలో వ్యక్తిగత గోప్యత అన్నది ఏమీ లేకుండా పోతుంది. దీనికి పౌరులు ఏమాత్రం ఇష్టపడే వీలుండదని చెబుతున్నారు.

ట్రంప్ సర్కారు చూస్తుంటే.. అమెరికాలోకి రావొద్దన్న సూటిమాట చెప్పకుండా.. రాకుండా చేయటానికి ఏమేం చేయాలో అవన్నీ చేసే దిశగా పావులు కదుపుతున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే ట్రంప్ నిర్ణయంతో పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్న వారు.. తాజా నిర్ణయం కానీఅధికారికం అయితే.. వ్యక్తిగత స్వేచ్ఛ.. గోపత్యకు అస్కారం లేకుండా పోయే అంశంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News