కరోనా కట్టడి కోసం భారత్ తో పాటు పలు దేశాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కఠినంగా ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తిని నిర్మూలించడానికి లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని పలువురు నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడ్డాయి. అయితే, భారత్ లో లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో, మే 17 తర్వాత కూడా జూన్ 1వరకు లాక్ డౌన్ 4.0 ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే కరోనా కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జులై చివరి నాటికి భారత్ లో కరోనా విలయతాండవం చేస్తుందని, భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతాయని ఎయిమ్స్ డైరెక్టర్ కూడా చెప్పారు. ఇపుడు తాజాగా అదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది.
జులై చివరి వారంలో భారత్ లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రాయబారి డేవిడ్ నబారో వెల్లడించారు.అయితే, కంగారు పడవలసిందేమీ లేదని...ఒక్కసారిగా కేసులు పెరిగినా కూడా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ఆయన చెప్పారు.
కరోనా కట్టడి విషయంలో భారత్ చాలా వేగంగా చర్యలు తీసుకుందని, సకాలంలో లాక్ డౌన్ విధించడం వల్ల తక్కువ కేసులు నమోదయ్యాయని నబారో చెప్పారు. సరైన సమయంలో స్పందించడం వల్ల కరోనా కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందని, అది కూడా అర్బన్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని అన్నారు. జనసంచారం తక్కువగా ఉండే గ్రామాల్లో కరోనా ప్రభావం పెద్దగా లేదని అన్నారు.
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య కొంత కాలం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. జూలై నెలలో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అన్నారు. జులైకు ముందు కొన్ని రోజుల పాటు కేసుల నమోదు సంఖ్య స్థిరంగా ఉంటుందని చెప్పారు. కేసుల సంఖ్య భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులు పెరిగినా క్రమంగా వైరస్ అదుపులోకి వస్తుందని చెప్పారు. 130 కోట్ల జనాభాతో పోలిస్తే కేసుల సంఖ్య చాలా తక్కువేనని చెప్పారు. భారత్ లో వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల మరణాల రేటు కూడా తక్కువగా ఉందని అన్నారు. యువకుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కూడా కేసులు తక్కువగా నమోదయ్యాయని చెప్పారు.