ఆ స‌ల‌హా ఇచ్చిందెవ‌రు?

Update: 2020-04-14 17:30 GMT
ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మిగ‌తా వారికి భిన్నంగా స‌ల‌హాలు ఇచ్చారు. లాక్‌ డౌన్ కొన‌సాగించాలి కానీ కొన్ని స‌డ‌లింపుల‌తో చేయాల‌ని ప్ర‌తిపాదించారు. ఆరెంజ్‌ - గ్రీన్‌ - రెడ్ జోన్‌ లుగా విభ‌జించి లాక్‌ డౌన్ అమ‌లు చేయాల‌ని సూచించారు. ఈ స‌మ‌యంలో ఆంధ్ర ప్ర‌దేశ్‌ లో అమ‌లుచేస్తున్న విధానానికి దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. అలాంటి విధానాన్నే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమ‌లు చేయ‌నున్నార‌ని రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం సాగింది.

దేశంలో క‌రోనా తీవ్రంగా వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో రెడ్ జోన్‌ గా ప్ర‌క‌టించి వంద శాతం లాక్‌ డౌన్ అమ‌లు చేస్తార‌ని - త‌క్కువ సంఖ్య‌లో క‌రోనా ఉన్న ప్రాంతాల్లో ఆరెంజ్ జో్న్‌ గా గుర్తించి కొన్ని స‌డ‌లింపుల‌తో లాక్‌ డౌన్ అమ‌లు - ఇక క‌రోనా ప్ర‌భావం పూర్తిగా లేని ప్రాంతాలను గ్రీన్ జోన్‌ గా ప్ర‌క‌టించి పూర్తి లాక్‌ డౌన్ ఎత్తివేస్తార‌ని వార్త‌లు వినిపించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాల‌ను ప్ర‌ధాన‌మంత్రి మోదీ దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తార‌ని ప్ర‌చారం సాగింది. తీరా ఏప్రిల్ 14వ తేదీ ప్ర‌ధాన‌మంత్రి జాతినుద్దేశించి ప్ర‌సంగించిన స‌మ‌యంలో ఆ విష‌యాలేవి ప్ర‌స్తావ‌న‌కు రాలేదు. మే 3వ తేదీ వ‌ర‌కు సంపూర్ణంగా లాక్‌ డౌన్ దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో వైఎస్సార్సీపీ నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌క‌పోగా తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌కు ఇది ఆయుధంగా మారింది.

ఇప్ప‌టికే లాక్‌ డౌన్ అమ‌లు విష‌యంలో విమ‌ర్శ‌లు చేస్తున్న టీడీపీ ఈ అంశాన్ని తీసుకుని మ‌రోసారి ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆ స‌ల‌హా ఎవ‌రు ఇచ్చారు? ఎలా ఆ అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన విధానం బాగున్న‌ప్ప‌టికీ క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి మాత్రం దోహ‌దం చేయ‌దు. ఎందుకంటే లాక్‌ డౌన్ స‌డ‌లింపుల‌తో అమ‌లు చేస్తే ప్ర‌జ‌ల రాక‌పోక‌లు మొద‌లై - వ్యాపారాలు కొన‌సాగితే క‌రోనా వైర‌స్ వ్యాప్తికి దోహ‌దం చేస్తాయ‌ని భావించి కేంద్ర ప్ర‌భుత్వం ఆ నిర్ణ‌యంపై వెన‌క్కి త‌గ్గింద‌ని తెలుస్తోంది. అందుకే దేశ‌వ్యాప్తంగా లాక్‌ డౌన్ సంపూర్ణంగా అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News