మళ్లీ కేటీఆర్ సీఎం అన్న వాదన తెర పైకి వచ్చింది. తెచ్చింది మంత్రి శ్రీనివాస గౌడ్. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ లకు వ్యతిరేకం గా కేసీఆర్ జాతీయ స్థాయి లో ఉద్యమిస్తే రాష్ట్ర పగ్గాలను కేటీఆర్ అందుకో వచ్చని.. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే అని శ్రీనివాస గౌడ్ చెప్పుకొచ్చారు.
శ్రీనివాస గౌడ్ ఈ వ్యాఖ్యల ను ఏకంగా తెలంగాణ భవన్ లోనే చెప్పడం కొసమెరుపు. దీన్ని బట్టి అధినేత కేసీఆర్ ఆమోదం తోనే ఆయన ఈ బహిరంగ ప్రకటన ను చేశారని అర్థమవుతోంది. కేసీఆర్ పూర్తి మద్దతు శ్రీనివాస్ గౌడ్ కు ఉందని తెలుస్తోంది.
అయితే ఇప్పటికిప్పుడు కేసీఆర్ వైదొలిగి.. కేటీఆర్ ను ఎందుకు సీఎం చేస్తారనే ప్రశ్నకు మాత్రం శ్రీనివాసగౌడ్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. బహుశా ఈ విషయంలో ఆయనకు సరైన గైడెన్స్ ను టీఆర్ఎస్ టీం ఇవ్వలేదనుకుంటా.. అందుకే కేటీఆర్ ఐటీ మంత్రి చేస్తున్న సేవలు.. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ.. కేసీఆర్ కంటే ముందు కేటీఆర్ ను కలిసి అంతా చక్కబెడుతున్నారని.. కేసీఆర్ తర్వాత కేటీఆరే తెలంగాణ లో అంటూ శ్రీనివాస గౌడ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక కేసీఆర్ తర్వాత సీఎంగా కేటీఆరే అని అందరూ భావిస్తున్నట్టు తెలిపారు.
ఎంఐఎం అధినేత అసద్ తాజాగా కేసీఆర్ ను జాతీయ స్థాయి లో పోరాటానికి రమ్మన గానే కేటీఆర్ నెక్ట్స్ సీఎం అన్న వాదనను టీఆర్ఎస్ వ్యూహాత్మకం గా తెర పైకి తెస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ కేసీఆర్ కోరుకున్నప్పుడు మాత్రమే కేటీఆర్ ను తెలంగాణ తదుపరి సీఎంగా చూడవచ్చు.