హైదరాబాద్ మహానగర శివారులోని మంచిరేవుల ఫాంహౌస్ లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతూ పట్టుబడటం తెలిసిందే. టాలీవుడ్ హీరో నాగశౌర్య లీజుకు తీసుకున్న ఈ ఫాంహౌస్ లో పట్టుబడిన పేకాట రాయుళ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక మాజీ ఐఏఎస్ అధికారి నుంచి ఐదేళ్లకు అద్దెకు తీసుకున్నారు నాగశౌర్య తండ్రి. దీనికి సంబంధించి లీజ్ అగ్రిమెంట్ కాపీని పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ఈ ఎపిసోడ్ లో మణికొండకు చెందిన గుత్తా సుమన్ కుమార్ ప్రధాన సూత్రధారిగా తేల్చారు.
ఇతడికి నాగశౌర్యకు మధ్యనున్న సంబంధం ఏమిటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ నిఘా విభాగపు అధికారులు సైతం ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించటంలో బిజీగా ఉన్నారు. ఫాంహౌస్ పేకాట ఎపిసోడ్ లో అరెస్టు అయిన 30 మందిని నార్సింగ్ పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపర్చారు. వీరికి కోర్టు బెయిల్ నిరాకరించటంతో పాటు ఈ నెల 15 వరకు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉదంతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ కేసులో కీలకంగా మారిన గుత్తా సుమన్ కుమార్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతడెవరు? అతడికి ఇంత భారీగా నెట్ వర్కు ఎలా సాధ్యమైంది? అతడి మీద ఏపీ.. తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న కేసుల మాటేమిటి? అన్న ప్రశ్నలతో పాటు.. అతగాడు ప్రైవేటు బాడీగార్డుల్ని పెట్టుకొని మరీ దర్జా ఒలకబోసే వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 15న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్ మెంట్ లో పేకాట ఆడుతూ సైబరాబాద్ పోలీసులకు చిక్కినట్లుగా గుర్తించారు.
సుమన్ కుమార్ తన చుట్టూ బాడీగార్డుల్ని పెట్టుకొని ప్రముఖుడిగా చలామణి అవుతుంటారని.. పెద్దవాళ్లతో పరిచయం ఉందని చెబుతూ ఎందరినో మోసం చేశాడని.. భూకబ్జాలకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మామిడి తోటల్లో పేకాట క్యాంపులు నిర్వహించే స్థాయి నుంచి ఫాంహౌజ్ లు.. స్టార్ హోటళ్లలో గదుల్ని అద్దెకు తీసుకొని నిర్వహించే వరకు వచ్చినట్లుగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఒక న్యూస్ చానల్ కు డైరెక్టర్ గా కూడా పని చేసినట్లుగా తెలుస్తోంది.
ఫాంహౌజ్ పేకాట శిబిరంపై దాడులు జరిగే వ్యవహారం ఒక గంట ఆలస్యంగా జరిగి ఉంటే.. మరికొందరు ప్రముఖులు కూడా వచ్చేవారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో సుమన్ ఫోన్ కీలకంగా మారినట్లు చెబుతున్నారు. అతడి ఫోన్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. ఇతర ప్రముఖులతో జరిపిన సంభాషణలు అందులో ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఫాంహౌస్ పేకాట వ్యవహారం పెను సంచలనంగా మారటంతో పాటు.. మరిన్ని మలుపులు తిరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.