క‌ర్నూలు అభివృద్ధికి అడ్డు ప‌డుతోందెవ‌రు..!

Update: 2021-12-12 03:30 GMT
రాయ‌ల‌సీమ జిల్లాల్లో వెనుక‌బాటు గురించి ప్ర‌త్యేకంగా ఎవ‌రూ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ నాలుగు జిల్లాల్లోనూ.. అనంత‌పురం, క‌డ‌ప‌, క‌ర్నూలు మ‌రింత వెనుక‌బ‌డి ఉన్నాయి. ఇక్క‌డ నుంచి వేలాది మంది ప్ర‌జ‌లు ఏటా.. ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స పోతున్నారు. అదేస‌మ‌యంలో.. ఉపాధి లేక‌.. పెట్టుబ‌డులు రాక‌..అనేక మంది జిల్లాల‌కు జిల్లాల‌నే వ‌దిలేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి అనేక మంది ముఖ్య‌మం త్రులుగా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ జిల్లాల‌ను ప‌ట్టించుకోలేద‌నే వాద‌న కూడా వినిపిస్తుంది.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి సీమ ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. క‌డ‌ప జిల్లాను కార్మిక శ‌క్తికి నిద‌ర్శ‌నంగా తీర్చిదిద్దుతున్నారు. చిత్తూరును పెట్టుబ‌డుల‌కు కేంద్రంగా మార్చుతున్నారు. అనంత‌పురాన్ని.. అధునాతన సాంకేతిక విప్ల‌వంతో కూడిన‌.. సాగు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక‌, క‌ర్నూలును..న్యాయ రాజ‌ధానిగా.. నిరంతరం ప్ర‌జ‌లు సంచారం చేసే న‌గ‌రంగా.. మార్చ‌బోతున్నారు. దీనివ‌ల్ల‌.. నాలుగు జిల్లాలు కూడా.. సంపూర్ణ, స‌మ‌గ్ర అభివృద్ధితో ముందుకు సాగుతాయ‌ని.. ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది.

అయితే.. క‌ర్నూలు విష‌యాన్ని చూస్తే.. ప్ర‌భుత్వం తీసుకునే ప్ర‌తి చ‌ర్చ‌నూ.. `కొంద‌రు` వ్య‌తిరేకిస్తున్నా రు. క‌ర్నూలుకు హైకోర్టును త‌ర‌లించేందుకు ఇష్ట‌ప‌డని రాజ‌ధాని రైతులు.. ఇప్ప‌టికే దీనిపై హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాల‌ను దాఖ‌లు చేశారు. అదేస‌మ‌యంలో లోకాయుక్త‌పైనా కేసులు వేశారు. క‌ర్నూ లులో లోకాయుక్త కార్యాల‌యాన్ని ఎలా ఏర్పాటు చేస్తార‌ని.. ప్ర‌శ్నించారు. అయితే.. దీనికి హైకోర్టు కూడా స‌మ‌ర్ధించ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో లోకాయుక్త కార్యాల‌యం ఏర్పాటు చేస్తే.. చాల‌ని.. అది ఇక్క‌డే ఉండాలి.. అక్క‌డే ఉండాల‌నే నియ‌మం లేద‌ని సంబంధిత వ‌ర్గానికి చుర‌క‌లు అంటించింది.

అదేవిధంగా రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను కూడా క‌ర్నూలులో నే ఏర్పాటు చేశారు. ఈ స‌మ‌యంలో నూ.. విజ‌య‌వాడ‌లోనే ఏర్పాటు చేయాల‌ని కొంద‌రు హైకోర్టుకు వెళ్లారు. ఈ విష‌యంనూ హైకోర్టు పైవిధం గానే రియాక్ట్ అయింది. సో.. ఎక్క‌డిక‌క్క‌డ‌.. క‌ర్నూలులో ఏం ఏర్పాటు చేస్తున్నా.. అడ్డుపడుతున్న‌వారు.. తాజాగా మ‌రో వివాదానికి తెర‌దీశారు. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 25న జారీ చేసిన జీవో 16ను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ విజయవాడ కు చెందిన ఓ మైనారిటీ వ్య‌క్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

2016లో జారీచేసిన జీవో 18 ప్రకారం విజయవాడలో వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సి ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఎలాంటి కారణాలు లేకుండా కర్నూలులో వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. అంటే.. క‌ర్నూలులో వ‌క్ఫ్ బోర్డు ఏర్పాటును అడ్డుకుంటున్నారు. మ‌రి.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ అడ్డు ప‌డుతూ.. క‌ర్నూలు ఏదొ ఒక ర‌కంగా అబివృద్ధి చెందుతుంటే.. అడ్డు ప‌డుతున్న‌దెవ‌రు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. అంతిమంగా.. ఇది ఆ పార్టీకి, ఆయా వ్య‌క్తుల‌కు మేలు చేయ‌క‌పోగా.. న‌ష్ట‌ప‌రిచేలా చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News