మందుబాబులకు కరోనా సోకదా? ఈ ప్రచారం నిజమేనా?

Update: 2021-04-17 03:17 GMT
‘ఆయన సాయంత్రం అయ్యిందంటే ఓ 90 ఎంఎల్​ మందు కొట్టి పడుకుంటాడు. అందుకేరా కరోనా రాలేదు. ఆల్కహాల్​ తీసుకొనే వాళ్లకు నోట్లోనే కరోనా వైరస్​ చనిపోతుందంట. రోగ నిరోధకశక్తి కూడా ఎక్కవవుతుందంట. అందుకే మందుబాబులకు కరోనా రావడం లేదు’ చాలా రోజులుగా ఇటువంటి ప్రచారం సాగుతుంది. గతంలో కరోనా పీక్స్​ లో ఉన్నప్పుడు వాట్సాప్​, ఫేస్ బుక్​ లో ఇటువంటి మెసేజ్​లు వచ్చేవి. మళ్లీ ఇప్పుడు కరోనా ఉధృతి పెరగగానే ఇటువంటి మెసేజ్​లు ఊపందుకున్నాయి.

అయితే ఆల్కహాల్​ తీసుకొనేవాళ్లకు నిజంగానే కరోనా రాదు. మనిషి చేతుల మీద కరోనా వైరస్​ను ఆల్కహాల్​ (శానిటైజర్​) చంపేస్తోంది. కాబట్టి శరీరంలో ఉన్న కరోనా వైరస్​ను కూడా ఆల్కహాల్​ చంపేస్తుందా? ఈ ప్రచారంలో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం.. నిజానికి ఆల్కహాల్​ తీసుకొనే వాళ్లకు కరోనా సోకదు అనడం దుష్ప్రచారం. ఇందులో ఎటువంటి నిజం లేదని వైద్యులు ఇది వరకే స్పష్టం చేశారు.

తాజాగా మరోసారి కూడా చెప్పారు. పైగా ఆల్కహాల్​ తీసుకొనే వాళ్లకు రోగనిరోధకశక్తి తగ్గిపోయి కరోనాతోపాటు ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.గతంలో కొందరు ప్రజాప్రతినిధులు సైతం ఇటువంటి దుష్ప్రచారం చేశారు. దీంతో అల్కహాల్​ తీసుకొనేవాళ్లకు కరోనా రాదు అని చాలా మంది నమ్మారు. ఈ ప్రచారంలో నిజం లేదని డాక్టర్లు చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం అదేపనిగా ఇటువంటి మెసేజ్​ లను ఫార్వార్ద్​ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా డబ్ల్యూహెచ్​వో కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.

SARS-CoV-2ను ఆల్కహాల్​ చంపేస్తోందని చెప్పడం వట్టి అపోహేనని సదరు సంస్థ స్పష్టం చేసింది. చర్మంపై ఉన్న వైరస్​ ను ఆల్కహాల్​ నాశనం చేస్తుంది గానీ.. శరీరంలోని వెళ్లాక దాన్ని ఆల్కహాల్​ ఏమీ చేయలేదని డబ్ల్యూహెచ్ వో స్పష్టం చేసింది. ఆల్కహాల్​ శరీరంలో ఉన్న కరోనా వైరస్​ ను చంపుతుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్​వో పేర్కొన్నది. పైగా ఆల్కహాల్​ తో ఇమ్యూనిటీ తగ్గుతుందని పేర్కొన్నది.

2015లో ఆల్కహాల్ రీసెర్చ్ ట్రస్టెడ్ సోర్సెస్ జర్నల్‌ లో ప్రచురించిన కథనం ప్రకారం.. ఆల్కహాల్ రోగనిరోధక కణాలను సరిగ్గా పనిచేయకుండా నిరోధించగలదని.. అంతేకాకుండా ఇన్ఫెక్షన్‌ తో పోరాడే రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుందని తెలిపింది. కాబట్టి మందు తాగడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగానీ మందు తాగితే కరోనా రాదు అనడం అపోహ మాత్రమే.
Tags:    

Similar News