మరో ఐదారు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ లో అధికారం లోకి రావాలని గట్టి పట్టుదల పై ఉన్న బీజేపీ.. ఆ దిశగా భారీగానే కసరత్తు చేస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ముందుగా పార్టీ ప్రక్షాళన పై బీజేపీ కేంద్ర పెద్దలు దృష్టి పెట్టారని సమాచారం. పార్టీ ని అన్ని విధాలా సంస్కరించి.. మరింత బలో పేతం చేయనున్నట్టు కొన్నాళ్లుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. దీని లో భాగంగా ఇప్పుడు తెలంగాణ బీజేపీ పగ్గాల ను ఎవరికి అప్పగిస్తారనే విషయం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
ఈ క్రమం లో బీజేపీ తెలంగాణ చీఫ్ పగ్గాల కోసం కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అవకాశం లభిస్తుందా? లేక... కాంగ్రెస్ ను వదలి బీజేపీ లోకి వచ్చిన మాజీ మంత్రి, గద్వాల్ జేజమ్మ గా పేరొందిన డీకే అరుణ కు అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తిగా మారిన చర్చ.
ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. డీకే అరుణ కే అవకాశం ఎక్కువగా ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అదేసమయం లో పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ కూడా ఈ పదవి కోసం ఎక్కువ గానే ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఖమ్మం పర్యటన కు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీని పై ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 15న అమిత్ షా ఖమ్మం లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. లక్ష మంది తో ఈ సభ జరిపేందుకు పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.
అమిత్ షా రాష్ట్ర పర్యటన కు వచ్చే లోపే రాష్ట్ర బీజేపీ లో భారీ మార్పులు జరగనున్నాయని కొందరు చెబుతుండగా.. ఆయన వచ్చిన తర్వాత.. ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటారని కొందరు అంటున్నారు. ఏదేమైనా పార్టీ నేతల మధ్య ఉన్న వర్గ విబేధాల ను తొలగించే దిశగా అగ్ర నాయకత్వం సీరియస్ గా కసరత్తులు చేస్తోంది.
బండి పై అసంతృప్తి!
తెలంగాణ బీజేపీ లో నేతల మధ్య కొన్నాళ్లుగా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ చీఫ్ బండి సంజయ్ పై కొందరు అంతర్గత చర్చల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు.. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుంటే.. ఇబ్బందులు తప్పవని భావిస్తున్న పార్టీ అధిష్టానం.. వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
ఈ క్రమంలోనే బండి సంజయ్ వ్యతిరేక వర్గానికి కీలక పదవులు ఇవ్వడం ద్వారా గొడవలు తొలగిపోతాయని, దీని ద్వారా నేతలందరూ ఏకతాటి పైకి వచ్చి పని చేస్తారని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని లో భాగంగానే ఈటల, డీకే అరుణల కు కీలక పదవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.