ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా శతాధిక వృద్ధ పార్టీగా కాంగ్రెస్ ని చెప్పుకోవాలి. ఆ పార్టీ స్వాతంత్రానికి ముందు పుట్టినది. ఇక దేశ స్వాతంత్రానికి కూడా ఎంతో కృషి చేసిన పార్టీ. దేశంలో కొన్ని దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన పార్టీ. అటువంటి కాంగ్రెస్ ఇపుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎంతలా అంటే ఆ పార్టీలో ఉన్న వారే విమర్శలు చేసేటంతగా. మా కాంగ్రెస్ పార్టీకి నాయకులే లేరు అంటున్నారు ఖద్దరు నేతలు. అందుకే ఇలా తయారైంది అని కూడా వారు వాడిగా వేడిగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ కి అధ్యక్షుడు అన్న వారు ఉంటే కదా అని కూడా నిట్టూర్పులు విడుస్తున్నారు. మరి ఇదంతా చూస్తూంటే కాంగ్రెస్ వైభోగం గతమేనా అనిపించక మానదు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 2018 డిసెంబర్లో ఎన్నిక అయి అట్టహాసంగా పట్టాభిషేకం చేసుకున్న రాహుల్ గాంధి ఆరు నెలలు తిరగకుండానే తనకీ పదవి వద్దు అంటూ కాడె వదిలేశారు. దానికి కారణం 2019 సార్వత్రిక ఎన్నికలు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడింది. మరో మారు బీజేపీ అధికారంలోకి వచ్చింది. దానికి బాధ్యత వహిస్తూ రాహుల్ తప్పుకున్నారు. ఆ మీదట తాత్కాలిక ప్రెసిడెంట్ గా కొన్నాళ్ళ పాటు అంటూ సోనియమ్మను తెచ్చి కూర్చోబెట్టారు. ఆ కొన్నాళ్లు కాస్తా రెండున్నరేళ్ళు అయినా ఆమె తప్ప మరో నాధుడు కాంగ్రెస్ కి కనిపించని పరిస్థితి ఉంది. ఈ మధ్యలో ఎన్నో సార్లు రాహుల్ ని బాధ్యతలు తీసుకోమని నేతాశ్రీలు అంతా కోరినా ఆయన ససేమిరా అంటూనే వస్తున్నారు.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ దేశంలో రెండు పెద్ద రాష్ట్రాలను కోల్పోయింది. కర్నాటక్, మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ కి సరైన నాయకత్వం లేకేనే అధికారాన్ని చేజార్చుకుంది. ఇక పంజాబ్ లో కుంపట్లు అయినా రాజస్థాన్ లో లుకలుకలు అయినా అంతా కూడా సారధి లేని దుస్థితి వల్ల దాపురించిన అనర్ధాలే అనుకోవాలి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ లోని సీనియర్లు అంతా వేరు కుంపటి పెట్టుకుని మరీ అధినాయకత్వం మీద బాణాలు వేస్తున్నారు. కపిల్ సిబాల్ అయినా గులాం నబీ అజాద్ అయినా కాంగ్రెస్ బాగుపడాలనే సూచిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు మాత్రం వారి మీద ఆగ్రహించడం తప్ప అడుగు ముందుకు వేయలేకపోతున్నారు.
ఈ నేపధ్యంలో ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీ సీడబ్య్లుసీ మీటింగ్ జరపాలని నిర్ణయించడం మంచి పరిణామమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి చాన్నాళ్ళకు కాంగ్రెస్ లో కొంత కదలిక వస్తున్నట్లుగానే దీన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం వెనక ప్రధాన ఉద్దేశ్యం నూతన నాయకత్వాన్ని తొందరగా ఎన్నుకోవడమే అంటున్నారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీని కూడా తెచ్చి మరీ కాంగ్రెస్ ని బలోపేతం చేసే చర్యలు తీసుకుంటారని అంటున్నారు. అన్న ప్రెసిడెంట్ అయితే చెల్లెలు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న మాట. ఇలా ఇద్దరి నాయకత్వంలో కాంగ్రెస్ బండిని లాగాలని అనుకుంటున్నారుట. అదే విధంగా తొందరలోనే సంస్థాగత ఎన్నికలు నిర్వహించి ప్లీనరీ కూడా జరిపించి కాంగ్రెస్ కి కొత్త ఉత్సాహం తీసుకురావాలని చూస్తున్నారుట. మరి అదే జరిగితే మాత్రం కాంగ్రెస్ జవసత్వాలు వచ్చినట్లే. కానీ రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ గిరీకి ఒప్పుకుంటాడా అన్నదే చూడాలిక్కడ అంటున్నారు.