మోడీ భార్యను ముందుకు నడిపిస్తున్నదెవరు?

Update: 2016-02-13 11:30 GMT
    ప్రధాని మోడీ భార్య యశోదా బెన్ లో ఇటీవల కాలంలో చాలామార్పు వస్తోంది. ఇప్పటికే తన పాస్ పోర్టు విషయంలో సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్న ఆమె దేశంలోని పలు సమస్యలపై గళం విప్పుతున్నారు. తాజాగా ఆమె ముంబైలో ఓ విషయంలో నిరాహార దీక్షకు దిగారు కూడా.

ముంబయిలో మురికివాడల్లో పేదల గుడిసెలను తొలగించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన యశోదా ముంబయిలో నిరాహార దీక్ష చేశారు. పేదల గుడిసెల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ ట్రస్టు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆమె వచ్చి దీక్ష చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇంతవరకు తన సొంత సమస్యపైనే పోరాడుతున్న ఆమె తొలిసారి ప్రజాసమస్యపై పోరాడారు. అంతేకాదు... గుజరాత్ నుంచి బయటకొచ్చి మహారాష్ట్రలో సమస్యలపై దృష్టి పెట్టి దీక్ష చేశారు. అది కూడా తన భర్త పార్టీ బీజేపీ సర్కారుపైనే ఆమె విమర్శలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో యశోదలో రాజకీయ చైతన్యాన్ని రగిలిస్తున్నదెవరు? ఆమె వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారు. లేదంటే ఆమెకే రాజకీయాల్లోకి రావాలన్న కోరికేమైనా కలిగిందా అన్న అంశాలపై రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News