పవన్ ప్రత్యేక విమానాలకు ఫండ్స్ ఎక్కడివి?

Update: 2016-02-13 05:25 GMT
ఈ మధ్యకాలంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు. అందులో వింతేముంది.. స్టార్ హీరో విమానాల్లో తిరగకపోతే షేర్ ఆటోలో వస్తాడా ఏంటి అనుకోవద్దు. ఆయన తిరుగుతున్నది మామూలు విమానాల్లో కాదు. ప్రత్యేక విమానాల్లో. ఆయన కోసమే ప్రత్యేకంగా వేసిన విమానాల్లో. అవును... తాజాగా అంబటి కుమార్తె వివాహానానికి వచ్చినప్పుడు గానీ, అంతకుముందు కాపు గర్జన విధ్వంసం అనంతరం కేరళలో షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రత్యేక విమానాల నుంచే దిగుతున్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నిత్యం ప్రత్యేక విమానాల్లో తిరగడం అంటే సాధారణ విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. నిజానికి పవన్ ఆర్థికంగా అంత పరిస్థితుల్లో లేరని చెబుతుంటారు. ఆయన కూడా ఆమధ్య అదే విషయం చెప్పారు. ఆయన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడంపై విలేకరులు అడిగితే... పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు దండిగా ఉండాలి కదా, నా దగ్గర అంత లేదు అని చెప్పారు. మరి... అలాంటి పవన్ ప్రత్యేక విమానాల్లోనే తిరుగుతుండడంతో ఆయనకు ఆ సౌకర్యాన్ని సమకూరుస్తున్నది ఎవరన్న ప్రశ్న వినిపిస్తోంది. పవన్ కు ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నది ఆయన సహాయం కోరుతున్న రాజకీయ నాయకులా.. లేదంటే సినీ నిర్మాతలే సమకూరుస్తున్నారా? లేదంటే పవనే సొంతంగా సమకూర్చుకుంటున్నారా అన్నది తెలుసుకోలేక ఆయన అభిమానులు కూడా సమాధానం కోసం వెతుక్కుంటున్నారట.

Tags:    

Similar News