బావ హ‌రీశ్ పై బావ‌ మ‌రిది కేటీఆర్ గెలుస్తారా?

Update: 2018-12-09 06:04 GMT
హ‌రీశ్ ఏమిటి?  కే టీ ఆర్ ఏమిటి?  ఇద్ద‌రి లో గెలుపేమిటి?  అస‌లు వారి గెలుపు గురించి మాట్లాడుకోవాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న క్వ‌శ్చ‌న్ల వ‌ర‌కూ వెళ్ల‌కండి. ఎందుకంటే.. ఇప్పుడు చెప్ప‌బోతున్న‌ది కేటీఆర్‌.. హ‌రీశ్ గెలుపు గురించి కాదు. వారిద్ద‌రికి వ‌చ్చే మెజార్టీ గురించి. మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. టీఆర్ఎస్ వ‌ర‌కూ చూస్తే.. ఈ ఇద్ద‌రు బావ‌.. బావ‌మ‌రుదులు పైకి న‌వ్వుతూ మాట్లాడుకున్నా.. ఒక‌రికొక‌రు పొగుడుకున్నా.. క‌డుపు లో క‌త్తులు నూరుకుంటార‌న్న‌ది ప‌చ్చి వాస్త‌వం.

ఇరువురి మ‌ధ్య అధిప‌త్య పోరు న‌డుస్తున్న మాట‌ను గులాబీ నేత‌లు బాహాటంగా నే చెబుతుంటారు. హ‌రీశ్ ను ఎక్కువ‌ సార్లు క‌లిసిన‌ట్లు తెలిస్తే.. త‌మ సంగ‌తి అంతేన‌న్న మాట‌ను చాలామంది ఎమ్మెల్యే లు చెప్పుకునేవారు. ఈ కార‌ణంతో నే కే టీ ఆర్‌ ను బాహాటంగా క‌లిసే చాలామంది హ‌రీశ్ ను మాత్రం గుట్టుగా క‌లిసి వ‌స్తుంటారు.

తాజా గా ముగిసిన ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రి గెలుపు విష‌యం లో ఎవ‌రి కి ఎలాంటి సందేహాలు లేవు. కాకుంటే.. వీరికొచ్చే మెజార్టీ మీద ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఈ ఇరువురి మ‌ధ్య అంత‌ర్గ‌తం గా ఉన్న అధిప‌త్య పోరు తో.. టీ ఆర్ ఎస్‌ లో బ‌య‌ట‌కు క‌నిపించ‌ని రెండు వ‌ర్గాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ రెండు వ‌ర్గాల్లో నూ త‌మ నేత‌ కే ఎక్కువ మెజార్టీ రావాల‌న్న మాట వినిపించ‌టం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

ఈ సారి ఎన్నిక‌ల్లో హ‌రీశ్ బ‌రిలో నిలిచిన సిద్దిపేట‌లో ఆయ‌న మెజార్టీ ల‌క్ష మార్క్ దాటాల‌న్న ల‌క్ష్యాన్ని ఆయ‌న అనుచ‌రులు పెట్టుకొని మ‌రీ ప‌ని చేసిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రో మాట‌గా చెప్పాలంటే.. హ‌రీశ్‌ కు వ‌చ్చే మెజార్టీ తో ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో ఉండే ఆద‌ర‌ణ ఎంత‌న్న విష‌యాన్ని చాటి చెప్పాల‌ని బ‌లంగా భావిస్తున్న‌ట్లుగా చెప్పాలి. టీ ఆర్ ఎస్ శ్రేణుల్లో ఇప్పుడు హ‌రీశ్ వ‌ర్స‌స్ కే టీ ఆర్ అన్న‌ది స్ప‌ష్టంగా ఉంది. హ‌రీశ్‌ ను తొక్కేస్తున్నార‌ని.. ఆయ‌నకు పెద్ద‌ గా ప్రాధాన్య‌త లేకుండా చేస్తున్న‌ర‌న్న ఆవేద‌న‌ను హ‌రీశ్ వ‌ర్గం భావిస్తోంది.

దీనికి బ‌దులుగా హ‌రీశ్ బ‌లం ఏమిటో అంద‌రికి తెలిసేలా మెజార్టీతో చెప్పాల‌న్న భావ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమంటే.. ఇదే భావ‌నను సిద్దిపేట ప్ర‌జ‌ల్లో నూ క‌నిపిస్తోంది. సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ తో మాట్లాడుతున్న‌ప్పుడు హ‌రీశ్ కు ల‌క్ష‌కు పైగా మెజార్టీ  వ‌స్తుంద‌ని చెబుతుంటారు. అదే స‌మ‌యంలో కేటీఆర్ మెజార్టీ  మీద వారు వ్యంగ్య వ్యాఖ్య‌లు చేయ‌టం క‌నిపిస్తుంది. ఈ త‌ర‌హా భావోద్వేగం కేటీఆర్ బ‌రిలో ఉన్న సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించ‌దు. ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌న్న అంశం పై ఆస‌క్తి ఎంత ఉందో.. కే టీ ఆర్‌.. హ‌రీశ్ ల‌కు వ‌చ్చే మెజార్టీల మీద కూడా ఆస‌క్తి నెల‌కొంది. మ‌రి.. హ‌రీశ్.. కేటీఆర్ ల మ‌ధ్య నెల‌కొన్న మెజార్టీ పోటీ లో గెలుపు ఎవ‌రిద‌న్న‌ది తేలాలంటే మ‌రో రెండు రోజులు వెయిట్ చేయక‌త‌ప్ప‌దు.
Tags:    

Similar News