ఎందుకు అనిల్ అలా అరుస్తా ఉండావు !

Update: 2022-07-09 06:30 GMT
నెల్లూరు అనిల్ మ‌ళ్లీ రీఛార్జ్ అయ్యారు. రాజకీయాల్లో ఆయ‌న త‌న‌దైన శైలిలో మాట్లాడ‌డం ఓ పెద్ద ప్ర‌త్యేకత క‌దా ! ఇప్పుడు దానికి  కొన‌సాగింపు ఇస్తూ తాను రీఛార్జ్ అయిన పొలిటీషియ‌న్ అని చెబుతూ, ఇక‌పై పోరాటం చేస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేసి వెళ్లారు. జ‌గ‌న‌న్న వెంట న‌డిచి, ప్ర‌త్య‌ర్థిపై యుద్ధం చేస్తాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. బాగానే ఉంది.. ఈ పాటి మాట‌ల‌కు అరుపులెందుకు.. ఆవేశంతో ఊగిపోయి మ‌రి ! విప‌క్షాల‌ను తిట్ట‌డం ఎందుకు అని ప్ర‌శ్నిస్తున్నారు ప‌రిశీల‌కులు.

వైసీపీ ప్లీన‌రీలో నిన్న‌టి వేళ అనిల్ మాట్లాడారు. పద‌వి లేక‌పోయినా ఫ్ర‌స్టేష‌న్ త‌నకు లేద‌నే అన్నారు. అందుకే జ‌గ‌న‌న్న త‌న గుండెల్లోనే ఉన్నారు అని కూడా అన్నారు. అంతేకాదు త‌న‌కు ప‌దవులు ముఖ్యం కాదు అని ఈ మాజీ మంత్రి మ‌రో గ్రేట్ స్టేట్మెంట్ ఇచ్చి స‌భా ప్రాంగ‌ణంలో ఉన్న వారంద‌రినీ వేడెక్కించి ఊగించి తూగించి పోయారు.

ఎందుకిలా ? ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను తిడితేనే ప్లీన‌రీ హిట్ అవుతుంద‌ని ఎవ్వ‌రైనా చెప్పారా ? అంటే జ‌గ‌న‌న్న  క‌న్నెర్ర జేస్తే ప్ర‌త్య‌ర్థి పార్టీల‌న్నీ ప‌త్తా లేకుండా పోతాయి అని ఎవ్వ‌రైనా అన‌మ‌ని చెప్పారా ?  ఎందుక‌ని అదే ప‌నిగా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను తిట్టి త‌మను తాము త‌గ్గించుకుంటారు ? ఇవే ప్ర‌శ్న‌లు విశ్లేష‌కుల నుంచి వినిపిస్తున్నాయి.

మాకు పోలీసుల‌తో ప‌నిలేదు. జస్ట్ జ‌గ‌నన్న ఒక్క మాట చెబితే చాలు ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కుల‌ను అస్స‌లు చిరునామా లేకుండా చేస్తాం అని అన్నారు అనిల్. రాష్ట్రంలో మ‌ళ్లీ త‌మ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని కూడా అన్నారు. ఇదంతా బాగుంది.. అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నెల్లూరు ఆయ‌న చేసిన నాలుగంటే నాలుగు మంచి ప‌నులు చెప్ప‌లేక‌పోయారా? అవేవీ చెప్ప‌కుండా జ‌గ‌న్ దగ్గ‌ర మెప్పుకోస‌మే ఇదంతా మాట్లాడారా ? లేదా జ‌గ‌న్ చెప్పిన వ్యూహం ప్ర‌కారం ఆయ‌న నడుచుకుని విధేయ‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నారా?

విప‌క్ష నాయ‌కుల‌ను తిట్టేందుకు ఏవో ప‌దాలు వాడారు. అస్సలు టీడీపీ నేత చంద్ర‌బాబుకు రోజుల్లేవు అన్న చందంగా మాట్లాడారు. ఓ ద‌శ‌లో ఆవేశంతో ఊగిపోయారు. త‌న‌కు ప‌ద‌వి లేనంత మాత్రాన మాట్లాడ‌కుండా ఉండ‌లేన‌ని అన్నారు. మా నాయ‌కుడు మాకు నేర్పిన సంస్కారం కార‌ణంగా ఆగిపోతున్నామ‌ని కూడా అన్నారు. సంస్కారం అంటే ఏంటి స‌ర్ అర్థం..ఒక్క‌సారి చెబుతారా ?  అని ప‌సుపు పార్టీ పెద్ద‌లు ప్ర‌శ్నిస్తున్నారు. యువ నేత లోకేశ్ ను అన‌రాని మాట‌లూ అన్నారు అనిల్..

ఇది కూడా రాజ‌కీయ వ్యూహ‌మే అనుకుందాం.. త‌మ అధినేత జ‌గ‌న్ మాదిరిగానే ఈనాడు తో స‌హా మిగ‌తా మీడియాను టార్గెట్ చేశారు. ఇది కూడా వ్యూహ‌మే అనుకుందాం..  ఇన్ని చేశాక పొలిటిక‌ల్ మైలేజ్ పెరిగిపోతుంద‌ని ఎలా అనుకుంటున్నార‌ని అని అంటున్నాయి విప‌క్షాలు.
Tags:    

Similar News