అమిత్-జూనియర్ భేటీని ఎందుకు దాటేస్తున్నారు?

Update: 2022-08-23 09:13 GMT
బీజేపీ నేతల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నుండి కింద స్థాయి నేత వరకు అమిత్ షా-జూనియర్ భేటీ విషయంపై మాట్లాడటాన్ని దాటేస్తున్నారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్, జూనియర్ ఇద్దరి మధ్య  డిన్నర్ భేటీ జరిగింది. దాదాపు 25 నిమిషాలు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య ఏ విషయాలపై చర్చలు జరిగాయన్నది మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు.

ఇదే సమయంలో వీళ్ళ భేటీ ఏదో మర్యాదపూర్వకంగానే జరిగిందని, త్రిబుల్ ఆర్ సినిమా గురించి మాట్లాడేందుకే జూనియర్ ను అమిత్ ఆహ్వానించారని బీజేపీ నేతలు కతలు చెబుతున్నారు. త్రిబుల్ ఆర్ సినిమాను అమిత్ చూశారా లేదా అన్నది కూడా ఎవరికీ తెలీదు.

ఒకవేళ సినిమాలో జూనియర్ నటనను అభినందించేందుకే అయితే ప్రత్యేకించి జూనియర్ ను అమిత్ హోటల్ కు ఆహ్వానించక్కర్లేదు. సినిమా చూసిన వెంటనే ఫోన్ చేసో లేదా ట్విట్టర్ ద్వారానో కూడా  జూనియర్ ను అభినందింవచ్చు.

వాస్తవం ఏమిటంటే వీళ్ళిద్దరి భేటీ నూరుశాతం రాజకీయమే అనటంలో సందేహం లేదు. కాకపోతే ఇపుడే భేటీ విషయాలు బయటకు రావంతే. ఇంత మాత్రానికే కమలనాథులు భుజాలు తడుముకుంటున్నారు.

వీళ్ళిద్దరి భేటీలో ఏమి మాట్లాడుకున్నారనే విషయం తెలీదని కిషన్ అండ్ కో చెప్పవచ్చు. అంతేకానీ కేవలం సినిమా గురించే అని చెప్పి జనాల చెవుల్లో పువ్వులు పెడదామని చూస్తున్నారు. తాము చెప్పేది జనాలు ఎవరు నమ్మరని తెలిసినా కతలు మాత్రం చెప్పేస్తున్నారు.

మాజీ మంత్రి కొడాలి నాని చెప్పినట్లు నరేంద్రమోడీ అయినా అమిత్ షా అయినా ఎవరినీ ఊరికే కలవరు, మాట్లాడరు. బీజేపీలో చేరమని అడగానికో లేకపోతే ప్రచారం చేయమని అడగటానికో మాత్రమే జూనియర్ ను అమిత్ విందుకు ఆహ్వానించుంటారనటంలో సందేహంలేదు. కాకపోతే అమిత్ షా ఆఫర్ కు జూనియర్ ఏ విధంగా స్పందించారనేదే ఇక్కడ ఆసక్తికరం. చూద్దాం ఏ విషయం బయటపడకుండానే ఉంటుందా ?
Tags:    

Similar News