పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఒక అనుభూతి .. ఆ అనుభూతిని పొందినవాడు చాల గొప్పగా చెప్తాడు ..అనుభవం లేని వాడు ఆ మధురమైన అనుభవం కోసం ఎదురుచూస్తుంటారు. పెళ్లి అనగానే ఆ ఇంట్లో నెల రోజుల ముందుగానే హడావిడి మొదలౌతుంది. వచ్చే బంధువులతో ఇంటికి కొత్త కళ వస్తుంది. ఇక పెళ్లి కొడుకు , పెళ్లి కూతురు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఎన్నో అసలు ..మరెన్నో సందేహాలతో పెళ్లి పీటలపై కి ఎక్కి ఒక్కటౌతారు. కానీ , ముహూర్తానికి కొద్దీ సమయం ఉండగా పెళ్లి కూతురి మేడలో తాళి కట్టాల్సిన ఒక యువకుడు తన మెడకి ఉరి తాడు బిగించుకున్నాడు. పెళ్లి మండపంలోనే ఈ సంఘటన జరగడంతో ..ఆ కొత్త జంటని మనసారా ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులు , స్నేహితులు షాక్ అయ్యి, బోరున విలపించారు.
ఈ సంఘటన హైదరాబాద్ కొంపల్లి టీ–జంక్షన్‌లో ఉన్న శ్రీకన్వెన్షన్‌లో జరిగింది. పెళ్లి కొడుకు చిన్నప్పటినుంచి తనను అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య జాగేశ్వరరావు నెలక్రితం మృతి చెందడంతో సందీప్ బాగా కుంగిపోయాడు, అలాగే పెళ్లి కొడుకుని చేసే సమయంలో తండ్రి కొడుకుల మధ్య ఒక చిన్న గొడవ కూడా జరగడంతో .. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. మలక్‌పేటకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ నక్కెర్తి శ్రీనివాస్‌చారి, పద్మజ రాణిల కుమారుడు సందీప్. చిన్నప్పుడే తల్లి చనిపోవడం, తండ్రి మరో పెళ్లి చేసుకోవడంతో ..సందీప్ చిన్నప్పటినుండి తన తాతయ్య జాగేశ్వరరావు వద్ద పెరిగాడు. బి టెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న సందీప్ కి బోయిన్‌పల్లికి చెందిన ఓ యువతితో ఏప్రిల్ నెలలో నిశ్చితార్థం చేశారు. కానీ , ఆ పెళ్లికి నెల రోజుల సమయం ఉన్నప్పుడు తాత చనిపోవడంతో బాగా కుంగిపోయాడు.
ఇక అదే సమయంలో పెళ్లి డేట్ కూడా దగ్గరపడటం తో పెళ్లి పనులు ప్రారంభించారు. కానీ , తాతయ్య చనిపోయి నెల కూడా గడవకుండానే తనకు పెళ్లి ఏమిటంటూ వ్యతిరేకిస్తూ వచ్చాడు. కానీ , పెద్దలు మాత్రం పెళ్లిని నిర్ణయించారు. అలాగే పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం పై ఒక చిన్న గొడవ అయ్యింది. తన తల్లి చనిపోయిన ఇంట్లో నేను పెళ్లి కొడుకు కార్యక్రమాన్ని చేసుకోలేను అని చెప్పడంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సందీప్ ఆదివారం తెల్లవారుజామున కొంపల్లిలో ఉన్న వివాహ వేదిక వద్దకు వచ్చి తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయాడు. చిన్న గొడవే కదా అని అందరూ సందీప్ ని వదిలేసారు. మరుసటి రోజు ముహూర్తం సమయం దగ్గర పడటంతో సందీప్ డోర్ ఓపెన్ చేసి చుసిన బంధువులు షాక్ అయ్యారు ..పెళ్లి కొడుకుగా పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన సందీప్ .. శవంగా ఫ్యాన్ కి వ్రేలాడుతూ కనిపించాడు. ఈ విషయం తెలియని ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, మిత్రులు ఒక్కొక్కరిగా కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చి అక్కడ జరిగిన విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.