శివసేన అధినేత బాల్‌థాక్రే తెలియనివారు ఉండరు. ఎందుకంటే ఒక్క మహారాష్ట్ర రాజకీయాలనే కాక.. యావత్ భారత్ దేశ రాజకీయాలను ఆయన శాసించారు. ముంబై నగరంతోపాటు, మహారాష్ట్ర మొత్తాన్ని తన కనుసన్నుల్లో ఉంచుకున్నారు. కరడుగట్టిన హిందూవాదిగా ఆయన ఖ్యాతి గడించారు. చత్రపతి శివాజీ వారసుడిగా ప్రకటించుకొని.. హిందూవాదినని చెప్పుకొని కూడా అశేష ప్రజల మద్దతు పొందారు.
ఆయన సిద్ధాంతాలు నచ్చకపోయినా.. ఆయన స్పీచ్ అంటే ఎంతోమంది ఇష్టపడుతుంటారు. అయితే అంత కరుడుగట్టిన హిందూవాదిగా కొన్ని ప్రత్యేకమైన అభిరుచులు ఉండేవి. అయన మైకెల్ జాన్సన్ డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టపడేవారు. 1996వ సంవత్సరంలో ముంబైలో మైకెల్ జాక్సన్ ఓ మ్యూజిక్ షో ను నిర్వహించారు. అయితే ఆ షోకు అప్పట్లో అధికారంలో ఉన్న శివసేన కూటమి అనుమతి ఇచ్చింది. అది పేరుకు సంకీర్ణకూటమే అయినా.. అక్కడ థాక్రే మాటకు ఎదురుచెప్పేవాళ్లు ఉండేవారు కాదు. దీంతో ఆ షోకు థాక్రే అనుమతి ఇవ్వడం మాత్రమే కాదు.. వినోద పన్ను మినహాయింపు కూడా ఇచ్చారు. దీంతో థాక్రే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
హిందూ ధర్మాన్ని పరిరక్షించే శివసేన పార్టీ.. ఓ పాశ్చాత్య డ్యాన్స్‌కు ఎలా అనుమతి ఇస్తుందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనికి థాక్రే ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. ‘జాక్సన్ ఒక గొప్ప కళాకారుడు. మనం ఆయన్ను కళాకారుడుగా అంగీకరించాలి. ఆయన డ్యాన్స్ మూమెంట్స్ అద్భుతంగా ఉంటాయి.
చాలామంది ఆయనలా మూవ్ కాలేరు. మనం అలా చేయాలనుకుంటే ఎముకలు విరగ్గొట్టుకుంటాం. సంస్కృతి విషయానికివస్తే ఆయన అమెరికా విలువలకు ప్రాతినిధ్యం వహిస్తారు. దానిని అంగీకరించడంలో భారత్‌కు ఏం సమస్య ఉంది. జాక్సన్ అమెరికా సంస్కృతికి ప్రతినిధి, కాబట్టే మేం ఆయన్ను అంగీకరించాలని అనుకుంటున్నాం" అని అన్నారు. ఈ మాటలతో చాలామంది నోళ్లకు తాళాలు పడ్డాయి. 1996 నవంబర్ 1న ఎరీనాలో జాన్సన్ పాప్ షో నిర్వహించారు. ఈ షోకు దాదాపు 35 వేలమంది ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే ఈ షోకు దాదాపు 10 లక్షల డాలర్ల ఆదాయం వచ్చినట్టు సమాచారం. అయితే ఆ ఆదయంలో కొంత శివసేన నడిపే ఒక యూత్ ప్రాజెక్టుకు ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ షోకు అప్పట్లోనే రూ. 5వేలు ధర నిర్ణయించారు.
అయితే మహారాష్ట్ర ప్రభుత్వం పన్నుమినహాయింపు ఇవ్వడం పట్ల పలు ఆరోపణలు వచ్చాయి. 'ముంబయి గ్రాహక్ పంచాయత్' అనే కన్జూమర్ ప్రొటెక్షన్ గ్రూప్ ఈ పన్ను మాఫీని బాంబే హైకోర్టులో సవాలు చేసింది. అయితే కన్జూమర్ ప్రొటెక్షన్ గ్రూప్ పిటిషన్లను విచారించిన బాంబే హైకోర్టు కన్సర్ట్ టికెట్ల అమ్మకం ద్వారా లభించిన మూడు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఫ్రీజ్ చేసింది. పన్ను మాఫీని పెండింగులో ఉంచింది.వినోద పన్ను మాఫీని మెరిట్ ఆధారంగా మరోసారి పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.
అసలు ఒక పాప్ మ్యూజిక్ కన్సర్ట్‌కు పన్ను మాఫీ చేయచ్చా అనే చర్చ జరిగింది. అయితే, ఆ పాప్ షో జరిగిన 24 ఏళ్లకు, ఎన్నో సార్లు దీనిపై విచారణ జరిగిన తర్వాత, ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పన్ను మాఫీ నిర్ణయాన్ని సమర్థించింది. ఆ నిర్ణయం కూడా శివసేన సంకీర్ణ ప్రభుత్వమే తీసుకుంది అనేది యాదృచ్చిక్కమే. గత వారం మహారాష్ట్ర మంత్రి సుభాష్ దేశాయ్ దీనిపై మాట్లాడారు.
"మైకేల్ జాక్సన్ 1996లో ఇచ్చిన కన్సర్ట్‌కు సంబంధించి దాదాపు 33 లక్షల రూపాయల వినోద పన్నును మాఫీ చేయాలని క్యాబినెట్ తీర్మానం పాస్ చేసింది. ఇప్పుడు ఈవెంట్ నిర్వాహకులు ప్రభుత్వం నుంచి ఈ డబ్బు క్లెయిమ్ చేసుకోవచ్చని మీడియాలో చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలోనే జమచేయాలని మేం భావిస్తున్నాం. ఎందుకంటే ఆ చారిటీ ఇప్పుడు లేదు. నిజానికి, 1996లో భారత సంగీత ప్రియుల కోసం జాక్సన్ షో నిర్వహించడం అనేది ఒక అరుదైన కార్యక్రమ కంటే తక్కువేం కాదు" అన్నారు.