క్షేత్రస్ధాయిలో జరుగుతున్న విషయాలు గమనిస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. బీజేపీ నేత, సుప్రింకోర్టు లాయర్ అశ్వనీకుమార్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే అనుమానం బలపడుతోంది. పోయిన నెల 6వ తేదీన సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీలపై చేసిన ఫిర్యాదు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకు లేఖ రూపంలో చేసిన ఫిర్యాదును ఓ నాలుగు రోజుల తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం మీడియా సమావేశంలో బయటపెట్టారు. దాంతోనే ఫిర్యాదు విషయం దేశమంతా తెలిసింది. అప్పటి నుండి గోల మొదలైంది. న్యాయమూర్తులపై ఫిర్యాదే చేయకూడదంటూ కొందరు న్యాయవాదులు, వాదిస్తున్నారు.
మరికొందరైతే ఫిర్యాదులు చేయవచ్చు కానీ దాన్ని బహిర్గతం చేయకూడదంటూ చెబుతున్నారు. సుప్రికోర్టు సీజేకి చేసిన ఫిర్యాదును బయటపెట్టడం అంటే అది కోర్టు ధిక్కారణ క్రిందకే వస్తుందంటున్నారు మరి కొందరు న్యాయవాదులు. ఇదే సమయంలో జగన్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎంఎ షా లాంటి వాళ్ళంతా జగన్ ఫిర్యాదు చేయటంలో కానీ చేసిన ఫిర్యాదును బహిర్గతం చేయటంలో కానీ తప్పేమీ లేదని వాదిస్తున్నారు.
సరే ఎవరి వాదనలు ఎలాగున్నా ఓ విషయం మాత్రం స్పష్టమైపోతోంది. అదేమిటంటే జగన్ పై ఎలాగైనా కోర్టు ధిక్కారం చర్యలు తీసుకునేట్లుగా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ పై ఒత్తిడి పెట్టాలన్న లక్ష్యమే కనబడుతోంది. ఎలాగంటే జగన్ పై కోర్టు ధిక్కారం చర్యలు తీసుకునేట్లుగా కోర్టులో కేసు పెట్టాలని బీజేపీ నేత, సుప్రింకోర్టు లాయర్ అశ్వనీకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరి పైనైనా కోర్టు ధిక్కారం కేసు పెట్టాలంటే ముందుగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అనుమతి అప్పనిసరి. అందుకనే అశ్వనీకుమార్ అటార్నీ జనరల్ కు లేఖ రాశారు.
అయితే లాయర్ రాసిన లేఖను అటార్నీజనరల్ తోసిపుచ్చారు. కోర్టు ధిక్కార కేసు వేయటానికి తాను అనుమతి ఇవ్వలేనంటూ వారం రోజుల క్రితం లాయర్ కు సమాధానం ఇచ్చారు. అయితే మొదటిసారి రాసినట్లుగానే మళ్ళీ రెండోసారి కూడా లాయర్ అటార్నీజనరల్ కు లేఖ రాయటమే విచిత్రంగా ఉంది. రెండో లేఖలో కూడా కోర్టు ధిక్కారం కేసు వేయటానికి అనుమతి కోరారు. దానికి మళ్ళీ వేణుగోపాల్ మొదటిసారి ఇచ్చిన సమాధానం ఇచ్చారు. పైగా సుప్రింకోర్టు చీష్ జస్టిస్ కు రాసిన లేఖలో జగన్ ఎక్కడా కాన్ఫిడెన్షియల్ అని చెప్పలేదు కాబట్టి అది పూర్తిగా ప్రైవేటు వ్యవహారమే అని తేల్చేశారు. పైగా ఆ లేఖ పై నిర్ణయం తీసుకునే అధికారం సుప్రింకోర్టు సీజేకి ఉంది కాబట్టి తాను అనుమతి ఇవ్వటం సాధ్యం కాదన్నారు. జగన్ పై చర్యలు తీసుకోవాలంటే కోర్టే సూమోటాగా ఆపని చేయచ్చని రెండోసారి ఘాటుగానే సమాధానం చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ పై కోర్టు ధిక్కారం చర్యలు తీసుకునేట్లు చేయాలన్నంత పట్టుదల అశ్వనీకుమార్ కు ఎందుకు ? ఏదైనా చర్యలు తీసుకునేట్లుంటే అది చీఫ్ జస్టిసే తీసుకుంటారు కదా ? మధ్యలో ఈ లాయర్ కు ఎందుకింత తొందర. ఇక్కడే వైసీపీ నేతల ఆరోపణలు నిజమే అని అనుమానాలు పెరుగుతున్నాయి. టీడీపీనే అశ్వనీకుమార్ తో లేఖలు రాయిస్తోందంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తన లేఖను అటార్నీ జనరల్ ఒకసారి తోసిపుచ్చినా మళ్ళీ మళ్ళీ లేఖలు రాస్తున్నారంటే అందరిలోను ఇదే అనుమానం పెరుగుతోంది.