అనూహ్యంగా వ్యవహరించటం.. అంచనాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవటం.. అందరు అనుకున్నది అస్సలు చేయకుండా ఉండటం లాంటి విచిత్రమైన తీరును ప్రదర్శిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తాను తప్పులు చేయొచ్చు కానీ.. అదే తప్పులు తన ప్రత్యర్థులు చేయటాన్ని అస్సలు క్షమించని గుణం ఆయన సొంతం. తాను టార్గెట్ చేసిన రాజకీయ పార్టీలు కనుమరుగు అయ్యేలా చేయటాన్ని రాజకీయ ఎత్తుగడగా అభివర్ణించే ఆయన.. ఆయన పార్టీని ఎవరైనా టార్గెట్ చేస్తే.. తెలంగాణను అస్థిరపర్చటానికి జరుగుతున్న కుట్రగా అభివర్ణిస్తారు.
తాజాగా ఎపిసోడ్ ను చూస్తే.. ఆయన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీగా ఎర వేసి.. బీజేపీ గూటికి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయటం.. దాన్ని ముందస్తుగా గుర్తించి.. తమ వారికి విసిరిన వలను.. తెలివిగా వల విసిరిన వారికి.. అదే వలతో ఉచ్చు బిగిసేలా చేసే టాలెంట్ కేసీఆర్ సొంతం. మొత్తంగా తనను టార్గెట్ చేసిన కమలనాథుల్ని.. ఆయన తెలివిగా ఆత్మరక్షణలో పడేయటంతో పాటు.. తాను చేస్తున్న వాదన నిజమన్న భావన కలిగించేందుకు వీలుగా ఒక్కొక్కటి చొప్పున ఆడియోను విడుదల చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పెను రాజకీయ దుమారాన్ని రేపిన ఎమ్మెల్యేల ఎర నేపథ్యంలో సంచలన ప్రెస్ మీట్ కు నిర్వహించనున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టే కన్నా దేశ రాజధాని ఢిల్లీలో చేస్తే.. నేషనల్ మీడియాను ఆకర్షించొచ్చన్న మాట వినిపించింది.
అందుకు తగ్గట్లే ఏర్పాట్లు జరిగినట్లుగా మీడియా రిపోర్టులు వచ్చాయి. నిజానికి గురువారం జరగాల్సిన ప్రెస్ మీట్ ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం ఢిల్లీలో జరుగుతుందని చెప్పారు. కానీ.. అందుకు భిన్నంగా తీవ్రమైన మేధోమధనాన్ని ప్రగతిభవన్ లో చేస్తున్న కేసీఆర్.. తదుపరి చర్యలో భాగమైన సంచలన ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
తొలుత గురువారం పెడతారన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? శుక్రవారం కచ్చితంగా పెడతారని భావించిన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ ఎపిసోడ్ మీద సంచలన ప్రెస్ మీట్ ఖాయంగా ఉంటుందని.. కేసీఆర్ కోరుకున్న బజ్ ఇంకా రాకపోవటంతో ఆయన తనదైన టైం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర ఎపిసోడ్ పై జాతీయ మీడియా తాను అనుకున్నంత ఎక్కువగా రియాక్టు కాకపోవటంతో ప్రెస్ మీట్ ఆలోచనపై వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే తాము సేకరించిన ఆడియో క్లిప్ ను రెండు భాగాలుగా బయటపెట్టిన టీఆర్ఎస్.. ఈరోజు.. రేపు వీడియో ఫుటేజ్ ను తమ వ్యూహంలో భాగంగా విడుదల చేస్తారని చెబుతున్నారు. ఇలా ఒక్కొక్కటిగా వెల్లడయ్యే అంశాలు ఈ ఇష్యూను లైవ్ లో ఉంచటంతో పాటు.. ఈ ఇష్యూను జాతీయ మీడియా తప్పనిసరిగా హైలెట్ చేసే వరకు వెయిట్ చేసి.. ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మోడీషాలకు తనదైన షాకులు ఇవ్వటం ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.