దేశ ప్రధాని నరేంద్ర మోడీపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కరోనా సమయంలో ఆయన వ్యవహరించిన తీరును పక్కన పెడితే.. ప్రపంచ దేశాలతో పోటీ పడి తమ సత్తా చూపించి.. దేశ పతాకాన్ని వినువీధుల్లో ఎగరేసేందుకు సిద్ధమైన ఒలింపిక్ క్రీడాకారుల విషయంలోనూ ప్రధాని మోడీ.. కేవలం మాటలకే పరిమితం కావడం.. అందరినీ నిశ్చేష్టులను చేస్తోంది. ఈ నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వందల మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాలుపంచుకుంటున్నారు.
వీరిలో పీవీ సింధు సహా మేరీ కోమ్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు ఉన్నారు. వీరిని ఉద్దేశించి ప్రధాని వర్చువల్‌గా భేటీ అయ్యారు. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లను ఉత్సాహ పర్చేందుకు వారితో ముచ్చటిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పిలుపునిచ్చారు. వారి వెనక దేశం మొత్తం అండగా ఉందన్నారు. అత్యున్నత క్రీడా వేదికపై అథ్లెట్లు రాణించి భారత పతాకం రెపరెపలాడించాలని మోదీ అభిలాషించారు.
ఈ సందర్భంగా ప్రధాని పలువురు దిగ్గజ క్రీడాకారులు మేరీకోమ్, పీవీ సింధు, సౌరభ్ చౌదరి, శరత్ కమల్ ..తదితరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మొత్తం 228 మంది బృందం వెళుతుందని, అందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారని భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు నరిందర్ బత్రా పేర్కొన్నారు. వీరిలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారన్నారు. మొత్తం 85 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడుతున్నారని చెప్పారు.
అయితే.. ఇక్కడ అంతుచిక్కని అనేక ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. అనేక మంది అథ్లెట్లు అనేక మంది వ్యవప్రయాసలకు ఓర్చుకుని శిక్షణ పూర్తి చేశారు. వీరికి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. అంతెందుకు గత ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి దేశ పతాకను ఎగురవేసిన.. పీవీ సింధు కూడా ఇటీవల ప్రాక్టీస్ సమయంలో రెస్ట్ తీసుకునేప్పుడు.. ఎలాంటి అలుపు రాకుండా చూసుకునే ఒక పరికరాన్ని కొనుగోలు చేసుకునేందుకు క్రీడా సంస్థను అభ్యర్థించాల్సి వచ్చింది. దీనిని కొనేంత డబ్బులు తన దగ్గర లేవని ఆమె సాయం కోరింది . వెంటనే సదరు సంస్థ దీనిని కొనేందుకు డబ్బులు ఇచ్చింది.
మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్న. ఇలాంటి సమయంలో మోడీ చెప్పాల్సింది మాటలేనా.. ? ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఆయన ఏ మాత్రం ప్రయత్నించకపోవడం గమనార్హం. అంతేకాదు.. మీరు పతకాలు సాధిస్తే.. ప్రోత్సహిస్తామని.. నగదు ప్రైజ్‌లను కూడా ఆయన ప్రకటించలేకపోయారు. ఒడిశా సహా యూపీ ప్రభుత్వాలు, ఢిల్లీ కూడా ఈ విషయంలో కోట్ల రూపాయలు కుమ్మరిస్తామని.. ఒలింపిక్ క్రీడాకారులను ఉత్తేజ పరిచే నిర్ణయాలు తీసుకున్నా.. మోడీ మాత్రం మాటలతో సరిపుచ్చారని.. సోషల్ మీడియాలో విమర్శలు వస్తుండడం గమనార్హం.