అభినందన్‌ గన్‌ ని పాక్‌ ఎందుకు తిరిగి ఇవ్వలేదు

Update: 2019-03-03 08:33 GMT
మన మిగ్‌ విమానంతో పాకిస్తాన్‌ ఎప్‌ 16ని కూల్చి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు సూపర్‌ హీరో అభినందన్‌. అలాగే మన మిగ్‌ కూడా సాంకేతిక లోపంతో కూలిపోవడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ లో కూలిపోయింది. దీంతో. ప్యారాచూట్‌ సాయంతో పీఓకే దిగిన అభినందన్‌ని.. అంతర్జాతీయ ఒత్తిడితో పాక్‌ విడిచిపెట్టక తప్పలేదు. ఇండియాకు రాగానే ఐబీ అధికారులు అభినందన్‌ని విచారించారు. పాక్ అధికారులు ఏం అడిగారు? అభినందన్ ఏం చెప్పాడు? రహస్యాలు ఏమైనా వెల్లడించాడా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లో పడిపోయిన తర్వాత అభినందన్‌ దగ్గర ఓ గన్ తో పాటు భారత మ్యాప్ లు, అతను దిగాల్సిన ఎయిర్ బేస్ లు, వేలికి ఉంగరం, చేతికి వాచీ, కళ్లజోడు తదితరాలు కూడా ఉన్నాయి. పాక్ సైన్యానికి పట్టుబడే ముందు అభినందన్, తన వద్ద ఉన్న పత్రాలను నాశనం చేశాడు. తుపాకిని కూడా ఉపయోగించాడు. అభినందన్ పట్టుబడిన తరువాత, అతని వద్ద ఉన్న అన్ని వస్తువులను పాక్ స్వాధీనం చేసుకుంది. వేసుకున్న దుస్తుల నుంచి, ఐడీ కార్డు, గన్, ఉంగరం, వాచీ, కళ్లజోడు తదితరాలన్నీ తీసేసుకుంది. అభినందన్ ను తమ దేశానికి పట్టుబడిన యుద్ధ ఖైదీగా పేర్కొంటూ 27,981 నంబరును ఇచ్చింది. తిరిగి ఇండియాకు అప్పగిస్తున్న వేళ, గన్ ను ఇవ్వకుండా వాచీ, ఉంగరం తదితరాలను ఇస్తూ, వాటిని ఇచ్చినట్టు ఓ దస్త్రాలపై సంతకం చేయించుకుంది.

ప్రస్తుతం ఐబీ అధికారులు అభినందన్‌ ను విచారిస్తున్నారు. ఈ సమయంలో గన్ తనకు ఇవ్వలేదని వివరణ ఇచ్చాడు అభినందన్‌. అయితే. పాకిస్తాన్‌ గన్‌ తమ దగ్గరే అట్టిపెట్టుకోవడానికి ఒక కారణం. ఆ గన్‌ తోనే అభినందన్‌ అక్కడి ప్రజల్ని బెదిరంచడానికి గాల్లకి గాల్పులు జరిపాడు. అలా జరుపుతూ వారి ప్రాణాలకు ఏం ప్రమాదం లేకుండా కొంచెం సేపు పరిగెత్తాడు. ఈలోపు అక్కడికి వచ్చిన పాక్‌ సైనికులు అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాక్‌ పౌరులపై కాల్పులు జరిపినందున సాక్ష్యం కోసం  మాత్రమే ఆ గన్‌ ని పాకిస్తాన్‌ తన వద్ద అట్టిపెట్టుకుంది తప్ప అంతకుమించి ఇంకేం కారణం కాదు. తమ దేశంలో విచారణ పూర్తైన తర్వాత ఆ గన్‌ ని ఇండియన్‌ అధికారులకు అప్పగిస్తుంది.


Tags:    

Similar News