వైసీపీకి అతి పెద్ద సైన్యం నిజంగా అవసరమా అన్న ప్రశ్న వస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి జనాలు 151 సీట్లు ఇచ్చారు. మధ్యలో మరో నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి కలిశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో తొంబై శాతం సీట్లు ఆ పార్టీవే. ఇక ఈ మధ్య అతి పెద్ద బీసీ సదస్సు పెట్టి బీసీలంతా మా వైపే అని గొప్పగా చెప్పుకుంది.
తాము బీసీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చామని వెల్లడించింది లోక్ సభ రాజ్యసభలలో బీసీలు పది మంది ఉన్నారని, అలాగే, రాష్ట్రంలో జిల్లా పార్టీల అధ్యక్షులు 9 మంది ఉన్నారని, ఎమెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కలిపి 42 మంది దాకా ఉన్నారని ఒక జాబితా విడుదల చేసింది. అలాగే నియోజకవర్గ సమన్వయ కర్తలు 8 మంది ఉన్నారని, ఇక రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఇద్దరు ఉంటే అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎనిమిది మంది ఉన్నారని వెల్లడించింది.
ఇంకో వైపు చూస్తే జనరల్ కార్పోరేషన్ లో బీసీ చైర్మన్లు 32 మంది ఉంటే, కులాల కార్పోరేషన్ చైర్మన్లు 56 మంది ఉన్నారని వివరించింది. జిల్లా పరిషత్ చైర్మన్లు ఆరుగురు ఉంటే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు 12 మంది ఉన్నారని తెలియచేసింది. అలాగే మేయర్లు, డిప్యూటీ మేయర్లు 16 మంది ఉంటే డీసీసీబీ, డీసీ ఎం ఎస్ చైర్ పర్సన్లు 10 మంది ఉన్నారని, గ్రంధాలయ చైర్ పర్సన్లు ఆరుగురు ఉన్నారని, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు 19 మంది ఉంటే జనరల్ కార్పొరేషన్ డైరెక్టర్లు 135 మంది, బీసీ కార్పోరేషన్ డైరెక్టర్లు 667 మంది ఉన్నారని లెక్క చెబుతోంది
ఇక బీసీ కార్పోరేటర్లు 289 మంది ఉంటే, జెడ్పీటీసీ సభ్యులు 211 మంది, మునిసిపల్ చైర్ పర్సన్లు, వైఎస్ చైర్మన్లు 111 మంది ఉన్నారని, కౌన్సిలర్లు 841 మంది, ఎంపీటీసీలు, వైఎస్ ఎంపీపీలు 769 మంది ఉంటే, ఎంపీటీసీ సభ్యులు 2,791 మంది, సర్పంచులు 3,985, పంచాయతీ వార్డు మెంబర్స్ 58,872 మంది, ఏ ఎం సీ చైర్ పర్సన్లు, డైరెక్టర్లు 433 మంది ఉన్నరని వివరించింది. ఇలా లిస్ట్ అంతా చూసుకుంటే టోటల్ గా తేలిక లెక్క 82,488 మంది ఉన్నారు. వీరికి ఇతర పదవులు కూడా కలిపితే టోటల్ నంబర్ 85 వేలుగా తేల్చారు
ఇదంతా వైసీపీ బీసీ సైన్యం. ఈ మధ్యనే విడుదల చేసిన ప్రకటన్లో ఈ వివరాలు అన్నీ పార్టీ అధికారికంగా ప్రకటించినదే. మరి ఇంత పెద్ద ఎత్తున సైన్యం ఉండగా కొత్తగా అయిదు లక్షల ఇరవై వేల మంది గ్రామ సారధులు అవసరమా అంటే అదే వింతగా ఉంది కదూ. అంటే ఈ నంబర్ మీద నమ్మకం లేదా. లేక వారు పార్టీని పటిష్టం చేయలేరని సందేహమా అన్నది వైసీపీ పెద్దలే చెప్పాలి.
మరో వైపు చూస్తే వైసీపీకి ఇతర అగ్ర కులాలలో ప్రజా ప్రతినిధులు ఉన్నారు. జగన్ స్వయంగా చెప్పుకున్నట్లుగా నా ఎస్టీ, నా ఎస్సీ, నా మైనారిటీ అన్న వారి జాబితా కూడా ఎక్కువగానే ఉంది. మరి ఇంతమందిని ఉంచుకుని కూడా వీరికి ఇన్నేసి పదవులు ఇచ్చి కూడా పార్టీ పటిష్టం కాలేదని మూడున్నరేళ్ళలో పార్టీ తీరు సరిగ్గా లేదని వైసీపీ పెద్దలు భావిస్తున్నారా అన్నదే ఇక్కడ చర్చ.
అయితే దీనికి జవాబు బహు సులువు. వైసీపీ అధినాయకత్వం ఒప్పకపోవచ్చు కానీ ఎవరు ఎంతమంది ఉన్నా ఎవరిని ఎన్ని పదవులు అప్పగించినా పార్టీని కదిలించేది నడిపించేది మాత్రం సిసలైన కార్యకర్త. కార్యకర్త పార్టీకి జీవకర్ర. పార్టీ అట్టడుగున వెలగాలన్నా నిలవాలన్నా కూడా కూడా క్యాడర్ చాలా ముఖ్యం. మరి ఆ సంగతిని అధికారంలోకి వచ్చాకా వైసీపీ దారుణంగా విస్మరించింది అన్న విమర్శలు ఏనాడో వచ్చాయి.
ఇపుడు పీకే టీం సూచనలు ఇచ్చిందని మళ్లీ వారినే పిలిచి పెద్ద పీట వేయాలనుకుంటున్నారు. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నపుడు కార్యకర్తలను బాగా చూసుకుంటే వారే అన్నీ అవుతారు. వారే పార్టీని బలోపేతం చేస్తారు చేతిలో పవర్ ఉంది కదా అని నేల విడిచి సాము చేస్తే మాత్రం అధికారం శాశవతం కాదు, కానీ శాశ్వతమైన పార్టీయే కకావికలు అవుతుంది. ఇదీ మ్యాటర్. ఈ సంగతి తెలిసిన పార్టీలు ఆరేడు సార్లు వరసగా గెలిచి జెండా ఎగరేస్తున్నాయి. అధికారం వెలుగులో కార్యకర్తలు కనబడని వారికి మాత్రం చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.