తెలుగు అబ్బాయిలు ఎవర్ గ్రీన్ అందగాడు మహేష్ బాబు ఫొటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంటారు. హిందీ జనాలు సల్మాన్ లాంటి కండల వీరుడి ఫొటోను తెరపై ఉంచుకుంటారు. ఇక అమ్మాయిలు ఏం తక్కువ తినలేదు.. వాళ్లు రకుల్- శ్రద్ధాకపూర్ లాంటి కత్తిలాంటి హీరోయిన్ల బొమ్మలను ప్రొఫైల్ పిక్ లుగా వాడేస్తుంటారు. అసలు ముఖం మాత్రం చూపించరు. అందంగా లేమని కొందరు.. అందంగా ఉన్నా ఎందుకొచ్చిన లొల్లి అని మరికొందరు తమ నిజమైన ముఖాన్ని ఫేస్ బుక్- వాట్సాప్ లలో చూపించారు.
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో కూడా ఇలానే చేశారు ఓ ఆడ- ఓ మగ. ఫేస్ బుక్ లో బాలీవుడ్ హీరో- హీరోయిన్ల ఫొటోలు పెట్టుకున్నారు.. పేర్లు మార్చుకున్నారు. ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. చాట్ లతో ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకటే ఇక ఇకలు- పకపకలు.. ఫోన్లో బతాకానీ.. అది కాస్తా ప్రేమగా మారింది..
ఓ ఫైన్ మార్నింగ్ వీరిద్దరూ ఒక హోటల్ లో కలుద్దామని డిసైడ్ అయ్యారు. అప్పటి వరకు ఒకరు ముఖాలు ఒకరు చూసుకోకపోవడంతో తమ కొత్త పార్ట్ నర్ ఎలా ఉంటాడోనన్న ఆసక్తి వారిలో పెరిగిపోయింది. ఆ రోజు రానే వచ్చింది.
హోటల్ లో ఒకరినొకరు కలుసుకోగానే ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఎందుకంటే వారిద్దరు భార్యాభర్తలే. కొద్దిరోజులుగా గొడవలతో సావాసం చేస్తూ దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరు తమ భాగస్వామిపై కోపంతో ఇలా ఫేస్ బుక్ లో పేరు, ఫొటో మార్చుకొని ఆన్ లైన్లో చాటింగ్ లు చేసుకున్నారు. కొత్త భాగస్వామి దొరికాడని దగ్గరవుదామని ఆశించారు. కానీ పాత మొగుడు- పాత పెళ్లామే కళ్లమందు సాక్షాత్కారించేసరికి అవాక్కవ్వడం వీరి వంతైంది.