ఉన్న జీవితాన్ని చక్కగా గడిపితే ఏం బాగుంటుందనుకుంటారో ఏమో కానీ.. కొందరి ప్రవర్త చూస్తే.. ఇలాంటి నీచులు కూడా ఉంటారా? అన్న భావన కలుగక మానదు. బంగారం లాంటి బంధాల్ని చేజేతులారా చేజార్చుకునే దుర్మార్గుల ఉదంతాల్ని వింటే షాక్ తినాల్సిందే. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బంజారాహిల్స్ పోలీసులకు దృష్టికి వచ్చింది.
శ్రీనగర్ కాలనీలో ఉండే రఘు అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఒక మహిళతో పెళ్లైంది. మొదట్లో బాగానే ఉన్న రఘు.. పోనుపోను తనలోని అనుమానపు కోణంతో పాటు.. విశృంఖల సెక్స్ మీద వ్యామోహాన్ని ప్రదర్శించటం స్టార్ట్ చేశాడు. పోర్న్ వీడియోలకు బానిసైన అతడు.. అసహజ రీతిలో సెక్స్ చేయాలని పెళ్లాన్ని వేధించేవాడు.
ఉద్యోగి అయిన ఆ మహిళ మీద లేనిపోని అనుమానాల్ని రుద్దేవాడు. అనుమానంతో పుట్టింటికి కూడా పంపేవాడు కాదు. అంతేనా.. ఆమె స్నేహితుల వద్దకు వెళ్లి వెకిలి చేష్టలు ప్రదర్శించేవాడు. ఇలా శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్న భర్త తీరుతో విసిగిపోయింది.ఇదిలా ఉంటే.. సెక్స్ విషయంలో భార్యతో గొడవపడటమే కాదు.. అతను చెప్పినట్లు చేయనన్న పాపానికి ఆమెను తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
ఈ కామ పిశాచికి మరో కోణం కూడా ఉంది. భార్య జీతం మొత్తాన్ని తీసుకోవటమే కాదు.. డెబిట్.. క్రెడిట్ కార్డులను బలవంతంగా తీసేసుకొని జల్సాలు చేసేస్తుంటాడు. ఇతగాడి తీరుతో విసిగిపోయిన సదరు మహిళ తాజాగా పోలీసుల్ని ఆశ్రయించింది. పోర్న్ వీడియోల్లో మాదిరి సెక్స్ చేయకుంటే విడాకులు ఇస్తానంటూ బెదిరిస్తున్న భర్త తీరును పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో వెల్లడించింది. భర్త చేష్టలతో తానెంత మానసిక క్షోభకు గురవుతున్న విషయాన్ని ఆమె పేర్కొన్నారు. రఘు తీరుపై పోలీసుల్లోనూ విస్మయం వ్యక్తమవుతుంది. బుద్ధిగా కాపురం చేసుకోకుండా ఈ దారుణమేందన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. సదరు పోర్న్ భర్త గారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.