ఇండియన్ టీం క్రికెటర్ దినేశ్ కార్తీక్, దీపిక పల్లికల్ జంటకు కవలలు జన్మించారు. స్పోర్ట్స్ సెలెబ్రిటీలు అయిన ఈ జంటకు మగ కవలలు జన్మించిన విషయాన్ని దినేశ్ కార్తీక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. గురువారం తన భార్య డెలివరీ అయిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తన పేరుతో పాటు భార్య పేరు కలిసేలా వారికి కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేర్లు పెట్టినట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లలతో భార్యతో పాటుగా ఉన్న ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘ముగ్గురం ఐదుగురం అయ్యాం’ అంటూ క్యాప్షన్ జోడించాడు.
ఇక్కడ డీకే తన కుటుంబంలో పెంపుడు కుక్కను కూడా కలుపుకుని చెప్పడం విశేషం. టీమ్ ఇండియా క్రికెటర్, కామెంటేటర్ అయిన దినేశ్ కార్తీక్.. స్క్వాష్ ప్లేయర్అయిన దీపిక 2015లో పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రైస్తవ సాంప్రదాయంలో వారి పెళ్లి జరిగింది. దినేశ్ కార్తీక్-దీపిక పల్లికల్ జంటకు కవలలు పుట్టడంపై పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. మాజీ క్రికెటర్ వాసిమ్ జాఫర్ ఒక సెటైర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. 'ఒక బ్యాటర్ గా సింగిల్స్ ను డబుల్స్ గా మార్చినట్లు కార్తీక్ కవలను కన్నాడు' అని ట్వీట్ చేశాడు. దినేశ్ కార్తీక్ కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించి చివరిసారిగా ఐపీఎల్ 2021సీజన్లో మైదానంలో కనిపించారు. ఫైనల్ వరకూ వెళ్లిన నైట్ రైడర్స్ మాస్టర్ మైండ్ ధోనీ దెబ్బకు 27పరుగుల తేడాతో ఓడిపోవడంతో టైటిల్ చేజార్చుకుంది.అలాగే ఐసీసీ కామెంటరీ ప్యానలిస్టులో కూడా ఉన్నాడు. ఇక దీపిక పల్లికల్ ప్రపంచ స్క్వాష్ ర్యాంకింగ్స్‌లో టాస్ 10లో ప్రవేశించిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నది