ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి చెక్ చెప్పేలా రూపొందించిన టీకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు దేశాల్లో టీకా కార్యక్రమం జోరుగా సాగుతోంది. మొన్నటికి మొన్న భారత్ లో వంద కోట్ల డోసుల్ని పూర్తి చేసిన సందర్భంగా మోడీ సర్కారు భారీగా కార్యక్రమాల్ని నిర్వహించటం తెలిసిందే. ఇంతకాలం పెద్దలకు పరిమితమైన వ్యాక్సిన్ ఇప్పుడు పిల్లల వంతు రావటం తెలిసిందే.
ఇటీవల కాలంలో అమెరికాలో మరోసారి కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్న వేళ.. చిన్నారుల టీకాల్ని సైతం తీసుకొచ్చి.. వైరస్ వ్యాప్తికి చెక్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ దేశంలో చిన్నారులకు టీకా కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇలాంటివేళ.. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ చిన్నపిల్లల డోసేజ్ పెద్ద పరీక్షకు సిద్ధమైంది.
ఈ మధ్యనే కొవాగ్జిన్ కు అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇవ్వటం తెలిసిందే. దీంతో.. భారత్ బయోటెక్ తన వ్యాపార భాగస్వామి అయిన ఆక్యుజెన్ ఇంక్ తో కలిసి అమెరికాలో చిన్నారులకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమైంది. రెండేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల చిన్నారులకు టీకా ఇవ్వటానికి వీలుగా అమెరికా ఔషధ నియంత్రణ మండలి అనుమతి కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసింది అక్యుజెన్ ఇంక్.
అయితే.. చిన్నారులకు సిద్ధం చేసిన కొవాగ్జిన్ జూనియర్ వెర్షన్ కు అమెరికా ఓకే చెబుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. భారత్ లోని 526 మంది పిల్లలపై కొత్త కొవాగ్జిన్ టీకా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న దానిపై క్లినికల్ టెస్టుల్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అనుమతి దరఖాస్తుతో జత చేసినట్లు చెబుతున్నారు. క్లినికల్ పరీక్షలకు సంబంధించి కొవాగ్జిన్ పరీక్షించిన పిల్లల సంఖ్య తక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. క్లినికల్ పరీక్షల కోసం పరీక్షించిన సంఖ్య కూడా కీలకమవుతున్న వేళ.. పిల్లల కొవాగ్జిన్ కు అమెరికా సర్కారు ఓకే చెబుతుందా? అన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది. ఒకవేళ.. పిల్లలకు కొవాగ్జిన్ టీకా వేయటానికి అమెరికా సర్కారు ఓకే చెబితే.. ఆ దేశంలో అలాంటి అనుమతి పొందిన రెండో టీకాగా కొవాగ్జిన్ నిలుస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.