కులం పేరుతో పిలిస్తే కేసులు పెడతారా? రాజ్యాంగం మార్చాలి - సంజ‌నా అన్నే

Update: 2021-02-03 01:30 GMT
‘నేను కమ్మకులంలో పుట్టాను.. చౌదరి అని పిలుస్తారు. ఇంకొకర్ని రెడ్డి, రాజు ఇలా రకరకాలుగా పిలుస్తారు. కాని తక్కువ కులానికి చెందిన వాళ్లని ఆ కులం పేరుతో పిలిస్తే కేసులు పెడుతున్నారు. మమ్మల్ని అరే చౌదరీ అని దూషించడం కూడా చేస్తున్నారు. మేం కేసులు పెట్టకూడదా?? కమ్మ కులంలో పుట్టడం మా తప్పా?’ అని ప్రశ్నించింది సంజనా అన్నే.

అణగారిన వర్గాలు, ఉన్నత వర్గాలు అని ఏమీ లేవన్నది సంజనా. జనాలంతా ఒక్కటేనని, అందరూ తినేది తింటే.. ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పుకొచ్చింది. మనం పెట్టుకున్నంత వరకే ఈ కులాలని, కమ్మోళ్లలో తిండికి లేని వారు బోలెడు మంది ఉన్నారని చెప్పింది. ఉన్నత కులాల్లోని చాలామంది తిండికి లేనివాళ్లు ఉన్నారు. రిజర్వేషన్ల వల్ల 90 శాతం మార్కులు తెచ్చుకొని కూడా ఉద్యోగాలు రావట్లేదని, రిజర్వేషన్ల ద్వారా 30 శాతం మార్కులు వచ్చిన వాళ్లు ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకుంటున్నారని, ముందు ఈ రాజ్యాంగాన్ని మర్చాలని డిమాండ్ చేసింది సంజనా.

‘కులం తక్కువ అని మేం ఎప్పుడూ మాట్లాడం.. వీళ్ల కులం ఎక్కువ అని మీరే చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చింది సంజన. పెద్ద కులంలో పుట్టడం తప్పుకాదు.. చిన్న కులంలో పుట్టడం గొప్పకాదు అని చెప్పింది. ‘మీరే కేసులు పెడుతున్నారు.. స్కాలర్ షిప్‌లు తీసుకుంటున్నారు.. రిజర్వేషన్‌లతో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు.. మాకన్నా మీరే గొప్పవాళ్లు కదా.. ఓసీలకు రిజర్వేషన్లు లేవు.. స్కాలర్ షిప్‌లు రావు.. రుణాలు మాఫీ కావు.. పెన్షన్లు ఇవ్వరు.. ఉద్యోగాలు ఉండవు.. మా కష్టంతోనే బతకాలి. కులాలను బట్టి కాదు.. పేదరికాన్ని బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలి’ అని డిమాండ్ చేసింది. ఈ సిస్టమ్ మారాలని, ఖచ్చితంగా దీనిపై పోరాడతాని స్టేట్ మెంట్ ఇచ్చింది బిగ్ బాస్ కంటిస్టెంట్ సంజనా అన్నే.





Tags:    

Similar News