పెద్దిరెడ్డిని చంద్రబాబే కాపాడుతారా...?

Update: 2022-04-01 10:30 GMT
ఏపీలో ఇపుడు ఏ వైపు చూసినా పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మంత్రి వర్గ విస్తరణ ఉంది. దీంతో దీనిముందు ఇతర అంశాలన్నీ పక్కకు పోతున్నాయి. ఏపీలో కొత్త మంత్రులు ఎవరూ అన్న చర్చ ఒక వైపు ఉంటే మిగిలే ఒకరిద్దరు మంత్రులు ఎవరు అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఇక జగన్ క్యాబినేట్ ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన ఇంటిపేరు కూడా పెద్దిరెడ్డి. ఒంటిపేరు రామచంద్రారెడ్డి. ఆయన చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఆయన ఒంటి చేత్తో చిత్తూరు జిల్లా రాజకీయాలను నడిపిస్తున్నారు. వార్ వన్ సైడ్ అనేట్లుగా వైసీపీకి చిత్తూరుని రాసి ఇచ్చేశారు. నిజానికి చూస్తే  వైఎస్సార్ టైంలో  కానీ అంతకు ముందు కానీ  టీడీపీ కాంగ్రెస్ సరిసమానంగా బలాలు చూపించే చిత్తూరు జిల్లాలో ఇపుడు చంద్రబాబు కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగరేసిన ఘనత పెద్దిరెడ్డిదే.

ఇక గత ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు కానీ, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కానీ చూసుకుంటే వైసీపీ అప్రతిహత విజయాల వెనక పెద్దిరెడ్డి ఉన్నారు. ఇక కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి మంత్రాంగాన్నే వాడుకున్నారు. ఇలా పెద్దిరెడ్డి చంద్రబాబు సొంత జిల్లాలో ఆయనకు చుక్కలు చూపించారు.

ఈ నేపధ్యం ఇలా ఉంటే మంత్రి వర్గ విస్తరణలో పెద్దిరెడ్డిని తప్పిస్తారా లేదా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే పెద్దిరెడ్డి విషయంలో పొలిటికల్ ఈక్వేషన్స్ బాగా పనిచేస్తాయి అంటున్నారు. చంద్రబాబుని అక్కడ కంట్రోల్ చేయాలన్నా, టీడీపీ హవాకు చెక్ చెప్పాలన్న పెద్దిరెడ్డి మంత్రిగా ఉండాల్సిందే అన్న ఆలోచనలో వైసీపీ ఉందని టాక్.

మంత్రివర్గ విస్తరణ అంటే కంప్లీట్ గా ఎన్నికల క్యాబినేట్. మరి ఎవరు వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెస్తారో వారికే పదవులు. ఈ విషయంలో గతంలో పెట్టుకున్న కొన్ని నియమాలు, హామీలూ కూడా పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు. అలా కనుక చూసుకుంటే చిత్తూరు జిల్లా నుంచి చాలా మంది నేతలు పదవులు ఆశిస్తున్నా పెద్దిరెడ్డికి మాత్రం ఎలాంటి స్థాన చలనం ఉండదన్నది లేటెస్ట్ టాక్.

ఇక్కడ నుంచి రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరెడ్డి వంటి వారు పదవులు ఆశిస్తున్నారు. వారంతా జగన్ కి సన్నిహితులే. కానీ జిల్లా మొత్తాన్ని ఒడిసిపట్టి వైసీపీ వైపుగా టర్న్ చేయగలిగే పెద్దిరెడ్డినే మరోసారి  కంటిన్యూ చేస్తారు అంటున్నారు. దాంతో ఆర్కే రోజా ఆశలు ఈసారి కూడా నెరవేరే చాన్స్ అయిలే లేదు అంటున్నారు.

ఈసారి కుప్పం కోటను కొట్టాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. జగన్ కి చంద్రబాబుకు మధ్య ఉప్పూ నిప్పులా రాజకీయం వైరం ఉంటుంది. దాంతో ఇపుడు చంద్రబాబే పెద్దిరెడ్డి పదవిని  అలా కాపాడుతున్నారు అని సెటైర్లు పడుతున్నాయి. మొత్తానికి పెద్దిరెడ్డి అయిదేళ్ల మంత్రి అని ప్రచారం జోరుగా సాగుతోంది.
Tags:    

Similar News